Entertainment

Jr NTR: సౌత్ ఇండియన్స్‌ మధ్య నిప్పు రాజేసిన ఘనత ఎన్టీఆర్‌దే..!

ఏది ఏమైనా సౌత్ అంతా ఒకటి.. నార్త్ అంతా ఒకటనే భావన ప్రజల్లో ఉంది. కానీ సౌత్‌ ఇండియన్స్ మధ్య నిప్పు రాజేసిన ఘనత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు దక్కుతుందని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఆయనేం చేశారు అంటారా?

Jr NTR: సౌత్ ఇండియన్స్‌ మధ్య నిప్పు రాజేసిన ఘనత ఎన్టీఆర్‌దే..!

ఏది ఏమైనా సౌత్ అంతా ఒకటి.. నార్త్ అంతా ఒకటనే భావన ప్రజల్లో ఉంది. కానీ సౌత్‌ ఇండియన్స్ మధ్య నిప్పు రాజేసిన ఘనత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు దక్కుతుందని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఆయనేం చేశారు అంటారా? నిన్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోకి సంబంధించిన ప్రకటన వచ్చేసింది. నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా వేదికగా దీనిని ఒక ఆసక్తికర పోస్టర్‌తో, అలాగే ఒక ఇంట్రస్టింగ్ పోస్ట్‌తో ప్రకటించారు. పోస్టర్, పోస్ట్ రెండూ వివాదానికి కారణమయ్యాయి. ‘ఉత్తర భారతంలో పుట్టాడు. మధ్య భారతంలో పెరిగాడు.. దక్షిణాదిన పూజలందుకుంటున్నాడు’ అని పోస్ట్ పెట్టారు. ఇదే వివాదానికి అసలు కారణం.

ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముందంటారా? తప్పులెన్నేవారికి తెలుస్తుంది. తమిళ సంస్కృతి, ప్రాచీన సంగం సాహిత్యం ప్రకారం తమిళులు తమ ఆరాధ్య దైవాన్ని మురుగన్‌ అని పిలుచుకుంటారు. తమిళులు భాష, సంస్కృతి అంటే ప్రాణమిస్తారు. అలాంటప్పుడు మురుగన్‌ను ఉత్తరాదిన జన్మించాడని అంటే ఊరుకుంటారా? పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా, అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో తమిళానికి బదులు సంస్కృత శ్లోకాన్ని ఉపయోగించడంపై కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టోటల్‌గా ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఇక తెలుగు ఆడియెన్స్ ఊరుకుంటారా? అసలే ఎన్టీఆర్‌కు అభిమాన గణం చాలా ఎక్కువ.

పురాణాల ప్రకారం శివపార్వతుల కుమారుడైన కార్తికేయుడు హిమాలయాల్లో జన్మించాడు. అలాంటప్పుడు దేవుడిని ఒక ప్రాంతానికి ఎలా పరిమితం చేస్తామని తెలుగు ఆడియెన్స్ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి తమిళ్ వర్సెస్ తెలుగు గలాటా ప్రారంభమైంది. ఇదొక సున్నితమైన భక్తిరస సబ్జెక్ట్‌ కాబట్టి ఎవరి మనోభావాలూ దెబ్బతినకుండా సినిమాను రూపొందించాలని కోరుతున్నారు. ఒక్క పోస్టర్‌ లేదంటే పోస్ట్‌తో సినిమాను జడ్జ్ చేయవద్దంటూ ఓ వర్గం ఎన్టీఆర్ అభిమానులు కోరుతున్నారు. మొత్తానికి నెట్టింట సినిమా గురించి పెద్ద రచ్చే జరుగుతోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 30, 2026 11:37 AM