షాకింగ్ న్యూస్.. వాట్సాప్‌కు కేంద్రం బ్రేక్.. మెటాకు నోటీసులు..!
వాట్సాప్‌లో తాజాగా 'యూజర్‌నేమ్స్' (Usernames) ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని మెటా భావిస్తోంది. ఈ క్రమంలోనే దానికి సన్నాహాలు చేస్తోంది. పలువురు ప్రముఖులు సైతం ఇప్పటికే యూజర్ నేమ్ కోసం నమోదు చేసుకున్నారు.
వాట్సాప్‌లో తాజాగా 'యూజర్‌నేమ్స్' (Usernames) ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని మెటా భావిస్తోంది. ఈ క్రమంలోనే దానికి సన్నాహాలు చేస్తోంది. పలువురు ప్రముఖులు సైతం ఇప్పటికే యూజర్ నేమ్ కోసం నమోదు చేసుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే వాట్సాప్ కొత్తగా ప్రవేశపెట్టాలనుకున్న ఫీచర్‌కు బ్రేకులు వేసినట్టు సమాచారం. ఈ ఫీచర్‌ను భారతదేశంలో వెంటనే అమలు చేయవద్దని సైతం మెటా (Meta)కు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.
ప్రభుత్వం మెటాకు మూడు రోజుల్లోగా ఈ ఫీచర్‌పై సమగ్ర వివరణ ఇవ్వాలని సైతం నోటీసు జారీ చేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై ప్రభుత్వంతో సంప్రదింపులు పూర్తయ్యే వరకూ భారతదేశంలో ఈ ఫీచర్‌ను విడుదల చేయవద్దని కూడా సూచనలు చేసిట్టుగా తెలుస్తోంది. అసలు కేంద్రం అంతలా ఆందోళన చెందడానికి కారణమేంటంటే.. నకిలీ గుర్తింపులు, సైబర్ మోసాలు, మోసపూరిత ఖాతాల సృష్టి దీని కారణంగా పెరిగే ప్రమాదం ఉందని భావించడమే. ప్రసిద్ధ వ్యక్తులు, ప్రభుత్వ సంస్థలు లేదా కంపెనీల పేర్లతో పోలిన యూజర్‌నేమ్‌లు తీసుకుని మోసాలకు పాల్పడే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది.
అయితే మెటా యాజమాన్యం మాత్రం కేవలం వినియోగదారుల గోప్యతను మెరుగుపరచడానికే ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్టుగా చెబుతోంది. దుర్వినియోగాన్ని అడ్డుకునే భద్రతా చర్యలు కూడా ఇందులో ఉన్నాయని మెటా యాజమాన్యం తెలియజేస్తోంది. అయినప్పటికీ, భద్రతా అంశాలపై పూర్తిస్థాయి సమీక్ష పూర్తయ్యే వరకూ ఈ ఫీచర్ అమలుకు కేంద్రం అనుమతి ఇవ్వకూడదనే వైఖరిలో ఉన్నట్టుగా సమాచారం.