Politics

సీఎం విజయ్‌పై భారీ కుట్ర.. రూ.15 కోట్లు డీల్.. తమిళ పొలిటిక్స్‌లో హై వోల్టేజ్ ట్విస్ట్

రాజకీయాల్లో అడుగుకో ప్రత్యర్థి ఉంటాడు. ఏమరుపాటుగా ఉంటే వేసేస్తారు. తాజాగా తమిళ రాజకీయాల్లో మరో సంచలనం.. అలా విజయ్ సీఎం సీటును అధిరోహించి కొద్ది రోజులు కూడా కాకముందే ఆయన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రత్యర్థులు సన్నద్ధమై పోయారు.

సీఎం విజయ్‌పై భారీ కుట్ర.. రూ.15 కోట్లు డీల్.. తమిళ పొలిటిక్స్‌లో హై వోల్టేజ్ ట్విస్ట్

రాజకీయాల్లో అడుగుకో ప్రత్యర్థి ఉంటాడు. ఏమరుపాటుగా ఉంటే వేసేస్తారు. తాజాగా తమిళ రాజకీయాల్లో మరో సంచలనం.. అలా విజయ్ సీఎం సీటును అధిరోహించి కొద్ది రోజులు కూడా కాకముందే ఆయన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రత్యర్థులు సన్నద్ధమై పోయారు. ఎలాగైనా విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని రూ. కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సిద్ధమయ్యారు. కట్ చేస్తే సీఎం విజయ్.. సినిమాల నుంచి వచ్చారు కాబట్టి సినీ స్టైల్లో లాస్ట్ మినిట్‌లో సీన్ రివర్స్ చేసి ప్రత్యర్థులకు షాక్ ఇచ్చారు. మొత్తానికి సీఎం విజయ్‌పై భారీ కుట్రకు బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. తమిళ పొలిటిక్స్‌లో హై వోల్టేజ్ ట్విస్ట్‌గా దీనిని చెప్పవచ్చు

టీవీకే విజయ్ ఆధ్వర్యంలో కొత్తగా కొలువు దీరిన ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారీ కుట్రలు జరుగుతున్నట్లు కొద్ది రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈవ్యవహారంతో సంబంధమున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. అధికార టీవీకే ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింలపులకు ప్రలోభపెట్టిన ఆరోపణలపై బుధవారం (జులై 01) పోలీసులు యూట్యూబర్ ఐపీడీఎస్ తిరునావుక్కరసు, కరూర్‌కు చెందిన ఇద్దరు డీఎంకే కార్యకర్తలతో సహా నలుగురిని అరెస్టు చేశారు. పార్టీ ఫిరాయింపు కోసం సదరు వ్యక్తులు టీవీకే ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఆఫర్ చేశారట. మొత్తానికి ఈ అరెస్ట్ తమిళనాడులో సంచలనం రేపుతోంది.

టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి నిర్మల్ కుమార్ ఆరోపించారు. ఆయన ఆరోపణలు చేసిన కేవలం ఒక రోజు తర్వాత ఈ అరెస్టులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా ముగ్గురు ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక్కో శాసనసభ్యునికి రూ. 15 కోట్లు ఆఫర్ చేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. వీరిలో ఇద్దరు సెంథిల్ బాలాజీకి సన్నిహితులుగా భావిస్తున్నారు. దీంతో వీరిద్దరి అరెస్ట్ రాజకీయంగా కలకలం రేపుతోంది. యూట్యూబర్ ఐపీడీఎస్ తిరునావుక్కరసు అయితే లయరాజాను పార్టీ మారేలా ఒప్పించేందుకు ప్రయత్నించి ఆయన వినకపోవడంతో బెదిరింపులకు సైతం దిగినట్టుగా తెలుస్తోంది. అరెస్టు అయిన ఇద్దరు డీఎంకే కార్యకర్తల నివాసాల్లో సోదాలు నిర్వహించి నగదును స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 1, 2026 12:28 PM