Entertainment

పేరుకే బుల్లి రాజు.. రెమ్యూనరేషన్ మాత్రం భారీ స్థాయిలోనే.. ఎంతో తెలిస్తే..

ఒకప్పుడు మాస్టర్ భరత్ ఉండేవాడు. బొద్దుగా ముద్దుగా ప్రేక్షకులను తెగ ఆకట్టుకునేవాడు. అప్పట్లో కొన్ని రోల్స్‌ భరత్ కోసమే పుట్టాయేమో అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు భరత్ స్థానంలో బుల్లిరాజు అలియాస్ రేవంత్ వచ్చాడు.

పేరుకే బుల్లి రాజు.. రెమ్యూనరేషన్ మాత్రం భారీ స్థాయిలోనే.. ఎంతో తెలిస్తే..

ఒకప్పుడు మాస్టర్ భరత్ ఉండేవాడు. బొద్దుగా ముద్దుగా ప్రేక్షకులను తెగ ఆకట్టుకునేవాడు. అప్పట్లో కొన్ని రోల్స్‌ భరత్ కోసమే పుట్టాయేమో అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు భరత్ స్థానంలో బుల్లిరాజు అలియాస్ రేవంత్ వచ్చాడు. ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయిపోయాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. రేవంత్ అంటే దాదాపుగా ఎవరికీ తెలియదు. బుల్లిరాజు అంటే ఫేమస్. ప్రస్తుతం బుల్లిరాజు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. 'సంక్రాంతికి వస్తున్నాం' సక్సెస్‌తో వరుస సినిమా అవకాశాలను బుల్లిరాజు పొందుతున్నాడు.

'సంక్రాంతికి వస్తున్నాం' హిట్ తర్వాత చిరంజీవి 'మన శంకరవరప్రసాద్', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒకరాజు', ‘సింగిల్’ తదితర చిత్రాల్లో బుల్లిరాజు నటించాడు. తాజాగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న విక్టరీ వెంకటేశ్-కల్యాణ్ రామ్ మూవీలోనూ అవకాశం అందుకున్నాడని టాక్. ‍ఇప్పుడీ బాలనటుడు రోజుకు రూ.లక్ష పారితోషికం అందుకుంటున్నాడని తెలుస్తోంది. సినిమాలు మాత్రమే కాకుండా మాల్స్ ఓపెనింగ్, టీవీ షోలు, యాడ్స్ అంటూ ఎడాపెడా సంపాదిస్తున్నాడీ బుల్లిరాజు. మొత్తానికి చిన్న వయసులోనే తెగ సంపాదించేస్తున్నాడని ఇండస్ట్రీలో సైతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

బుల్లి రాజు అలియాస్ రేవంత్.. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా చానమిల్లి అనే గ్రామానికి చెందిన వాడు. ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్నాడు. అతను చేసిన ఓ వీడియో వైరల్ అవడంతో అతడిని చూసిన అనిల్ రావిపూడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోకి తీసుకున్నాడు. ఆ సినిమాతో అతని దశ మారిపోయింది. ఇది రిలీజైన తర్వాత బుల్లిరాజుగా ఈ చిత్రంలోని ప్రధాన పాత్రదారులతో సమానంగా క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి మనోడు ఏం చేసినా తెగ వైరల్ అవుతున్నాడు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 1, 2026 9:22 AM