‘అమీర్ లోగ్’ కోసం రంగంలోకి రానా ‘స్పిరిట్ మీడియా’
‘అమీర్ లోగ్’ కోసం రానా ‘స్పిరిట్ మీడియా రంగంలోకి దిగింది. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రూపొందిన ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో ఈ చిత్రంలో తెరకెక్కింది.
‘అమీర్ లోగ్’ కోసం రానా ‘స్పిరిట్ మీడియా రంగంలోకి దిగింది. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రూపొందిన ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో ఈ చిత్రంలో తెరకెక్కింది. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించారు. వేదశ్రీ, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి పలువురు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకూ వచ్చిన ప్రతీ అప్‌డేట్ ఆడియెన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ పోస్టర్, రాహుల్ సిప్లిగంజ్ పాడిన అవ్వల్ దావత్ సాంగ్, టీజర్ ఇలా అన్నీ బజ్‌ను క్రియేట్ చేయడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ చిత్రంగా ‘అమీర్ లోగ్’ తెరకెక్కింది. రానా ‘స్పిరిట్ మీడియా’ ఈ ‘అమీర్ లోగ్’ మూవీ హక్కుల్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని స్పిరిట్ మీడియా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని చూసి.. అందులోని కంటెంట్ నచ్చి.. రిలీజ్ చేసేందుకు రానా ముందుకు వచ్చారు. హైదరాబాద్ గల్లీలోని ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే కథ, వారి ప్రయాణాన్ని, యూత్‌కి ఇచ్చే సందేశం ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇవన్నీ నచ్చడంతో ‘అమీర్ లోగ్’ను విడుదల చేసేందుకు స్పిరిట్ మీడియా ముందుకు వచ్చింది.