others

వాహనదారులకు షాకింగ్ న్యూస్.. అస్సలు ఊహించలే..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన ధరలను ప్రైవేటు సంస్థలు అమాంతం పెంచేశాయి. ఉద్రిక్తతలు సాధారణ స్థితికి వచ్చాక తగ్గిస్తే ఏ రూపాయో తగ్గిస్తాయని అంతా భావించారు.

వాహనదారులకు షాకింగ్ న్యూస్.. అస్సలు ఊహించలే..

గత నెలలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు అమాంతం పెరిగాయి. డీజిల్, పెట్రోల్ ధరలు కొండెక్కుతుండటంతో వాటికి డబ్బు తగలెయ్యలేక జనాలంతా ఎలక్ట్రివ్ వాహనాలకు మొగ్గు చూపుతున్నారు. ఒక్క జూన్ నెలలోనే 18 లక్షల ఎలక్ట్రిక్ టూ వీలర్ల అమ్మకం జరిగిందంటే ఏ స్థాయిలో డీజిల్, పెట్రల్‌పై జనాలకు విసుగొచ్చిందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అసలు విషయానికి వస్తే ఇంధన ధరలు పెంచితేనేమో అమాంతం పెంచేస్తారు. ఒకవేళ తగ్గిస్తే అర్థరూపాయి, పావలా ఇలా తగ్గిస్తారు. ఈ అర్థ రూపాయి, పావలాలకు కాలం చెల్లి చాలా కాలం అవుతున్నా.. తగ్గింపు ఆ స్థాయిలోనే ఉంటుంది. ఇది ప్రభుత్వం చేసే పని. కానీ ఈసారి ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రైవేటు పెట్రోల్ బంకులు ఇష్టానుసారంగా ఇంధన ధరలను పెంచేశాయి. దీంతో ఇక పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని ఎవరూ ఊహించలే.

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన ధరలను ప్రైవేటు సంస్థలు అమాంతం పెంచేశాయి. ఉద్రిక్తతలు సాధారణ స్థితికి వచ్చాక తగ్గిస్తే ఏ రూపాయో తగ్గిస్తాయని అంతా భావించారు. కానీ బాగానే తగ్గించనున్నారని టాక్. డీజిల్‌పై రూ.3, పెట్రోల్‌పై రూ.5 తగ్గించనున్నారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు సద్దుమణిగిన తర్వాత, ఒక కీలకమైన సముద్ర మార్గం తిరిగి తెరుచుకుంది. దీంతో సరఫరా అంతరాయాలపై ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లు ధరలను యథాతథంగా ఉంచగా.. ఇతర ప్రైవేటు సంస్థలైతే ఇష్టానుసారంగా ధరలను పెంచేశాయి. ప్రస్తుతం అవి కూడా తిరిగి తగ్గించున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న నయారాకు చెందిన 7,000కు పైగా ఫ్యూయల్ స్టేషన్లన్నింటిలో సవరించిన ధరలు అమల్లోకి వచ్చాయి. దీనిని పరిశ్రమ వర్గాలు సైతం ధృవీకరిస్తున్నాయి. వ్యాట్ వంటి స్థానిక సుంకాల ఆధారంగా రాష్ట్రాల వారీగా వాస్తవ ధరల్లో మార్పులుంటాయి.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 1, 2026 6:55 AM