ఈ కొరియన్ ప్రేమకథ వరల్డ్ వైడ్ సెన్సేషన్.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..
వెబ్‌సిరీస్‌లకు క్రేజ్ పెరిగిపోతోంది. ముఖ్యంగా కొరియన్ వెబ్‌సిరీస్‌లపై మరింత ఆసక్తి పెరుగుతోంది. ప్రపంచమంతా కొరియన్ వెబ్‌సిరీస్‌లపై ఆసక్తి కనబరుస్తోంది.
వెబ్‌సిరీస్‌లకు క్రేజ్ పెరిగిపోతోంది. ముఖ్యంగా కొరియన్ వెబ్‌సిరీస్‌లపై మరింత ఆసక్తి పెరుగుతోంది. ప్రపంచమంతా కొరియన్ వెబ్‌సిరీస్‌లపై ఆసక్తి కనబరుస్తోంది. 'స్క్విడ్ గేమ్', 'క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ', 'గార్డియన్', 'డిసెండెంట్స్ ఆఫ్ ది సన్' అనే కొరియన్ వెబ్ సిరీస్‌లు ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణను సంపాదించుకున్నాయి. ఇక ఇండియాలోనూ యూత్ వీటికి బాగా కనెక్ట్ అవుతున్నారు. దీనికి కారణం.. కొరియన్ వెబ్‌సిరీస్‌ల్లో ఉండే విభిన్న కథలు, వండర్ విజువల్స్, మేకింగ్ క్వాలిటీ వంటివన్నీ చెప్పవచ్చు. ఈ వెబ్‌సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్‌తో మరికొన్ని ఓటీటీల్లో ప్రసారమవుతున్నాయి. తెలుగు డబ్బింగ్, సబ్ టైటిల్స్ అందుబాటులో ఉండడంతో తెలుగు ప్రేక్షకులు సైతం బాగా ఆకర్షితులవుతున్నారు.
కొరియన్ వెబ్ సిరీస్‌ల్లో కె-డ్రామాలు లవ్, ఫాంటసీ, సస్పెన్స్, యాక్షన్, భావోద్వేగాలు వంటి విషయాలకు ప్రాధాన్యమిస్తారు. హింస, మితిమీరిన అందాల ఆరబోత వంటి అంశాలకు అంత ప్రాధాన్యమైతే ఉండదు. స్నేహం, ప్రేమ అనే విలువలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి అంతటి ప్రాధాన్యత. అంతేకాకుండా జనాలు అంతగా ఇష్టపడానికి మరో కారణం కూడా ఉంది. కొరియన్ డ్రామాలు ఏళ్ల తరబడి, వందల ఎపిసోడ్లు సాగవు. దాదాపుగా 20 భాగాలకు మించి ఉండవు. ఇక మీకోసం కొన్ని కొరియన్ వెబ్ సిరీస్‌లు..
హోమ్‌టౌన్ చా-చా-చా (2021): సముద్ర తీరంలోని గోంజిన్ గ్రామంలో నడిచే ఇద్దరి కథ అయిన ఈ వెబ్ సిరీస్ ఈ రొమాంటిక్ కామెడీ జానర్‌లో రూపొందింది. నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ/ఇంగ్లీష్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది.
ట్వింక్లింగ్ వాటర్‌మెలన్ (2023): ఇదొక టైమ్-ట్రావెల్, సంగీతం కలయికతో రూపొందిన వెబ్ సిరీస్ ఇది. హీరో తన చెవిటి తల్లిదండ్రుల చిన్ననాటి రూపాలతో కలిసి ఒక బ్యాండ్‌ను ఏర్పాటు చేసే కథాంశంతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ వికీలో అందుబాటులో ఉంది.
క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ (2019): ప్రేమకథతో రూపొందిన వెబ్ సిరీస్ వరల్డ్ వైడ్ సెన్సేషన్. దక్షిణ కొరియా వారసురాలు, ఉత్తర కొరియా అధికారి మధ్య చిగురించిన ప్రేమ కథాంశంతో రూపొందిన కె-డ్రామా. ఇది నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో అందుబాటులో ఉంది.
బిజినెస్ ప్రపోజల్ (2022): ఆఫీస్ రొమాంటిక్ కామెడీగా ఇది రూపొందింది. ముఖ్యంగా భారతీయ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.