others

Falcon Scam Effect: రూ.14 కోట్ల జెట్‌కు రూ.3 కోట్లే.. ఈడీ ఆక్షన్‌లో బిగ్ ట్విస్ట్!

దేశంలోనే తొలిసారిగా ఎవ్వరూ ఊహించని ఘటన ఒకటి జరిగింది. వాస్తవానికి ఇది దేశంలోనే తొలిసారి. ఆ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా హైదరాబాద్ చూసింది. దేశానికి హైదరాబాద్‌ను స్కామ్‌కి కేపిటల్ చేసిన ఘనత ఫాల్కన్ గ్రూప్ (క్యాపిటల్‌‌‌‌ ప్రొటెక‌‌‌‌్షన్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌)కే సొంతం.

Falcon Scam Effect: రూ.14 కోట్ల జెట్‌కు రూ.3 కోట్లే.. ఈడీ ఆక్షన్‌లో బిగ్ ట్విస్ట్!

దేశంలోనే తొలిసారిగా ఎవ్వరూ ఊహించని ఘటన ఒకటి జరిగింది. వాస్తవానికి ఇది దేశంలోనే తొలిసారి. ఆ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా హైదరాబాద్ చూసింది. దేశానికి హైదరాబాద్‌ను స్కామ్‌కి కేపిటల్ చేసిన ఘనత ఫాల్కన్ గ్రూప్ (క్యాపిటల్‌‌‌‌ ప్రొటెక‌‌‌‌్షన్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌)కే సొంతం. అసలేం జరిగిందంటే.. విమానం వేలం వేశారు. దేశంలో విమానం వేలం వేయడమనేది తొలిసారి అయితే అది అసలు ఎందుకు వేయాల్సి వచ్చిందనేది మెయిన్ పాయింట్. మనీలాండరింగ్ కేసులో ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌ (ED) అధికారులు దీనిని వేలం వేయాల్సి వచ్చింది.

ఆసక్తికర విషయం ఏంటంటే.. రూ.14 కోట్లు విలువ చేసే బిజినెస్‌‌‌‌ ఎయిర్ క్రాఫ్ట్‌‌‌‌.. వేలంలో కేవలం రూ.3 కోట్లు మాత్రమే దక్కించుకుంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి ఎయిర్ క్రాఫ్ట్‌ను దక్కించుకున్నాడు. హైటెక్ సిటీ కేంద్రంగా ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరిట ఫాల్కన్ గ్రూప్.. స్కామ్‌‌కు పాల్పడింది. ఈ స్కామ్‌లో భాగంగానే ఈడీ అధికారులు దీనిని వేలం వేశారు. ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌‌‌‌టీసీ లిమిటెడ్ ద్వారా జులై 1న ఈ వేలం ప్రక్రియ నడిచింది. హైటెక్‌‌‌‌ సిటీలోని హుడా ఎన్‌‌‌‌క్లేవ్‌‌‌‌లో ఫాల్కన్ కంపెనీని నిర్వాహకులు 2020లో ప్రారంభించారు. ఫాల్కన్ గ్రూప్ సంస్థ హైటెక్ సిటీ కేంద్రంగా ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరిట పెద్ద ఎత్తున దందాకు తెరలేపింది.

హైటెక్‌‌‌‌ సిటీలోని హుడా ఎన్‌‌‌‌క్లేవ్‌‌‌‌లో 2020లో ఫాల్కన్‌‌‌‌ కంపెనీ ప్రారంభమైంది. బ్రిటానియా, అమెజాన్, గోద్రేజ్‌‌‌‌ తదితర సంస్థలతో తమకు సంబంధాలు ఉన్నాయంటూ నకిలీ ఒప్పంద పత్రాలను సృష్టించింది. వాటితో విస్తృతంగా ప్రచారం చేసి.. దాదాపు 7 వేల మంది డిపాజిటర్లను మోసం చేసి.. రూ.792 కోట్లకు పైగా టోపి పెట్టింది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు ఫాల్కన్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ అధినేత అమర్‌‌‌‌దీప్‌ ‌‌‌కుమార్‌‌‌‌కు చెందిన బిజినెస్‌‌‌‌ ఎయిర్ క్రాఫ్ట్‌‌‌‌ ‘ఎన్‌‌‌‌935హెచ్‌‌‌‌ హాకర్ 800ఏ’ను గత ఏడాది మార్చి 7న శంషాబాద్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌ పోర్టులో స్వాధీనం చేసుకున్నారు. ఈ విమానాన్ని విక్రయించేందుకు గత ఏడాదే అనుమతులు లభించాయి. గత ఏడాది నవంబర్ 20న న్యాయ నిర్ణాయక అధికార సంస్థ అనుమతి మంజూరు చేసింది.

తాజాగా ఈడీ ఆ వేలం ప్రక్రియను పూర్తి చేసింది.

ఇంటీరియర్ కోసమే రూ.3 కోట్లు..

ఫాల్కన్ గ్రూప్ చైర్మన్‌‌‌‌, ఎండీ అమర్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌కుమార్‌‌‌‌ 2024 ఫిబ్రవరిలో ‘ఎన్‌‌‌‌935హెచ్‌‌‌‌ హాకర్ 800ఏ’ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కొనుగోలు చేశాడు. యూఎస్‌‌‌‌ఏకు చెందిన ప్రెస్టీజ్ జెట్స్ ఇంక్ అనే కంపెనీ ద్వారా 1.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ.14 కోట్లు)కు విక్రయించారు. అనంతరం దానిని వ్యాపార అవసరాలు, మెడికల్ అంబులెన్స్‌‌‌‌కు వినియోగించే విధంగా మరో రూ.3 కోట్లు ఖర్చు చేసి ఇంటీరియర్‌‌‌‌‌‌‌‌ చేయించాడు. దానిని మెడికల్ అంబులెన్స్‌గా వాడి అమర్‌దీప్‌ కుమార్ గంటకు 3వేల నుంచి 3,500 డాలర్లు అద్దె వసూలు చేశారు. దీనికి సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ దుబాయ్ నుంచే కొనసాగేవి. దీని ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ మారకద్రవ్యం సంపాదించిన మీదట.. ఫాల్కన్‌‌‌‌ సంస్థ బోర్డు తిప్పేసింది. ఆ తర్వాత జనవరి 22న అమర్‌‌‌‌‌‌‌‌దీప్ కుమార్‌‌‌‌ ‌‌‌‌సహా కంపెనీ సీఈవో యోగేందర్‌‌‌‌‌‌‌‌, సీఓఓ ఆర్యన్ సింగ్‌‌‌‌ దుబాయ్‌‌‌‌కి పారిపోయారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 4, 2026 4:51 AM