‘కిల్లర్’ నుంచి జ్యోతి పూర్వజ్ మైండ్ బ్లోయింగ్ స్టిల్
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూర్వాజ్, పద్మనాభ రెడ్డితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను సైతం కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే ఈ మూవీ గ్రాండ్ రిలీజ్‌కు రానుంది.
ఇవాళ (శనివారం) జ్యోతి పూర్వజ్ బర్త్ డే సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ "కిల్లర్" నుంచి స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సూపర్ వుమెన్ గా, మిస్టీరియస్ ఉమన్‌గా జ్యోతి పూర్వజ్ మైండ్ బ్లోయింగ్ లుక్‌లో ఆకట్టుకుంటోంది. మెలిఫిసెంట్ మూవీలో ఏంజెలీనా జోలిని తలపించేలా జ్యోతి పూర్వజ్ లుక్స్ ఉండటం విశేషం. సినిమా విషయానికి వస్తే.. సూపర్ షీ క్యారెక్టర్‌లో జ్యోతి పూర్వజ్ నటన ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయనుంది. "కిల్లర్" సినిమాలో ప్రేక్షకులు మర్చిపోలేని ఒక ప్రపంచాన్ని డైరెక్టర్ పూర్వాజ్ క్రియేట్ చేస్తున్నారు.
పూర్వాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు సీఎన్ఏ ఇంటిగ్రేషన్, రాయ్ ప్రోటోకాల్ కోసం వర్క్ చేసే సైంటిస్ట్‌గానూ మెప్పించనున్నారు. ఈ సినిమా గురించి డైరెక్టర్ పూర్వాజ్ మాట్లాడుతూ.. "కిల్లర్" సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయని.. భారీ వీఎఫ్ఎక్స్ షాట్స్ కారణంగా కొంచెం ఎక్కువ సమయం పట్టిందన్నారు. ఇప్పుడు వీఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా పూర్తైందన్నారు. మరోవైపు బిజినెస్ టాక్స్ జరుగుతున్నాయని.. ఇండస్ట్రీలోని పలువురు టాప్ డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ తమ ప్రొడ్యూసర్స్‌తో కలిసి సినిమా చూసి సినిమా ఔట్ పుట్ పట్ల సంతోషం వ్యక్తం చేశారన్నారు. త్వరలోనే బిజినెస్ డీల్స్ కంప్లీట్ చేసుకుని సెన్సార్ పూర్తి చేసుకుని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తామని పూర్వాజ్ వెల్లడించారు.