others

కాఫీకి రూ.1500.. ఓ యువతి డేట్ కార్డ్.. నెటిజన్లు షాక్

కాలం మారిపోయిందంటే ఏంటో అనుకున్నాం. ఓ యువతి చేసిన పని చూస్తే ఓహో ఇలా మారిపోయిందా? అనిపిస్తుంది. ప్రస్తుతం కూటి కోసం కోటి విద్యలు అనే నానుడి వర్కవుట్ కావట్లే. లగ్జరీగా బతకడం కోసం ఎంతకైనా వెనుకాడట్లేదని అనిపిస్తోంది.

కాఫీకి రూ.1500.. ఓ యువతి డేట్ కార్డ్.. నెటిజన్లు షాక్

కాలం మారిపోయిందంటే ఏంటో అనుకున్నాం. ఓ యువతి చేసిన పని చూస్తే ఓహో ఇలా మారిపోయిందా? అనిపిస్తుంది. ప్రస్తుతం కూటి కోసం కోటి విద్యలు అనే నానుడి వర్కవుట్ కావట్లే. లగ్జరీగా బతకడం కోసం ఎంతకైనా వెనుకాడట్లేదని అనిపిస్తోంది. ఓ యువతి లగ్జరీ లైఫ్ కోసం సంపాదనకు కొత్త మార్గం వెదికింది. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఓ అమ్మాయి తాను అద్దెకు రెడీ అని.. బైక్ రైడ్, కాఫీ, డిన్నర్, ఫ్యామిలీని కలవడం వంటి వాటన్నింటికీ రేట్ ఫిక్స్ చేసేసింది. డేట్‌కి సంబంధించిన రేట్ల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దేశ మొత్తం పెద్ద ఎత్తున ఆ ఫోటోలు చర్చకు దారి తీశాయి.

నన్ను ఒక రోజుకు రెంట్‌కు తీసుకోండి (Rent Me for a Day) అనే పేరుతో ఒక మహిళ తనతో ఒక రోజు గడపడానికి వివిధ సేవలను అందిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇది కాస్తా నెటిజన్ల దృష్టిని ఆకర్షించడమే కాకుండా హాట్ టాపిక్‌గా మారింది. ఈ పోస్ట్‌ను ఎక్స్‌లో నలిని ఉనాగర్ అనే యూజర్ షేర్ చేసింది. ఆ పోస్టులో దివ్య అనే యువతి తనతో కాఫీ, డిన్నర్, షాపింగ్, ఈవెంట్లు, ట్రిప్ వంటి కార్యక్రమాలకు తన తోడు కోరుకునే వారికి ఒక్కొక్క దానికి ఒక్కో చార్జి నిర్ణయించింది. ఈ కాన్సెప్ట్‌పై కొందరేమో గిగ్ ఎకానమీకి చెందిన కొత్త అవకాశమని భావిస్తున్నారు. మరికొందరు మాత్రం సేఫ్టీ వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జనాలు దీనిని చూసి షాక్ అవుతున్నారు.

రేట్ కార్డ్ వివరాలు:

* కాఫీ డేట్ – రూ.1500

* డిన్నర్ + మూవీ – రూ.2000

* ఫ్యామిలీని కలవడం – రూ.3000

* ఈవెంట్‌కు తోడుగా రావడం – రూ.3500

* బైక్ రైడ్ – రూ.4000

* తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేయడం – రూ.6000

* అడ్వెంచర్ డే – రూ.5000

* కలిసి వంట చేయడం – రూ.3500

* షాపింగ్‌కు తోడుగా రావడం – రూ.4500

* రెండు రోజుల వీకెండ్ ట్రిప్ – రూ.10వేలు

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 8, 2026 11:03 AM