Entertainment

18 కిలోల బరువు తగ్గిన ఆమీర్ ఖాన్.. ఎలా తగ్గారో పూర్తి డీటైల్స్ మీకోసం..

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్.. ప్రస్తుతం ఆయన వయసు 60. ఈ సమయంలో ఆయన 18 కిలోల బరువు తగ్గారు. అసలు అన్ని కేజీలు ఆయన ఎలా తగ్గారో పూర్తి డైట్ చెప్పేశారు. దాని గురించి తెలుసుకుందాం.

18 కిలోల బరువు తగ్గిన ఆమీర్ ఖాన్.. ఎలా తగ్గారో పూర్తి డీటైల్స్ మీకోసం..

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్.. ప్రస్తుతం ఆయన వయసు 60. ఈ సమయంలో ఆయన 18 కిలోల బరువు తగ్గారు. అసలు అన్ని కేజీలు ఆయన ఎలా తగ్గారో పూర్తి డైట్ చెప్పేశారు. దాని గురించి తెలుసుకుందాం. తన ప్రతి సినిమా దానికి తగినట్టుగా శరీరాకృతిని మార్చుకుంటూ ఉంటారు. అలా చాలా సినిమాల్లో ఆయనలోని మార్పును మనం చూడవచ్చు. తాజాగా ఆయన ఏకంగా 18 కిలోల బరువు తగ్గారు. ఓ ఇంటర్వ్యూలో తను 18 కిలోలు బరువు తగ్గానని.. దాని కోసం ఎలాంటి డైట్‌నూ చేయలేదన్నారు. "నేను ఇప్పుడు పాటిస్తున్న కొత్త డైట్ ఆరోగ్య కారణాల వల్ల మొదలైంది. ఇది నాకు అద్భుతంగా పనిచేస్తోంది. ఇది యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ డైట్. దీని వల్ల నేను 18 కిలోల బరువు తగ్గడమే కాకుండా, ఎన్నాళ్లుగానో ఇబ్బంది పెడుతున్న మైగ్రేన్ తలనొప్పులు కూడా గణనీయంగా తగ్గాయి." అని ఆమీర్ ఖాన్ సదరు ఇంటర్వ్యూలో వెల్లడించారు.

యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ డైట్ అంటే ఏమిటంటే..

యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ డైట్ అనేది తాత్కాలికంగా బరువు తగ్గించే ఫ్యాడ్ డైట్ కాదు. ఇది శరీరంలో ఉండే దీర్ఘకాలిక వాపు (Chronic Inflammation)ను తగ్గించేందుకు సహాయపడే ఆరోగ్యకరమైన ఆహార విధానం. దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్ కారణంగా గుండె జబ్బులు, మధుమేహం, ఆర్థరైటిస్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ఈ డైట్‌లో ఏమేమి తింటారు?

యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ డైట్‌లో క్యాలరీలు లెక్కించడం కంటే నాణ్యమైన, సహజమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు.

తినాల్సిన ఆహారాలు:

తాజా పండ్లు

ఆకుకూరలు, కూరగాయలు

ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా, చిరుధాన్యాలు (మిల్లెట్స్)

పప్పులు, శనగలు, బీన్స్

డ్రై ఫ్రూట్స్, గింజలు (నట్స్, సీడ్స్)

ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్

ఒమేగా-3 అధికంగా ఉండే చేపలు

పరిమిత మోతాదులో గ్రీన్ టీ, బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ

దూరంగా ఉండాల్సినవి..

చక్కెర కలిగిన శీతల పానీయాలు

స్వీట్లు, క్యాండీలు

మైదాతో చేసిన బ్రెడ్, పాస్తా వంటి పదార్థాలు

డీప్ ఫ్రై చేసిన స్నాక్స్

అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు

ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న పదార్థాలు

ముఖ్యమైన విషయం ఏంటంటే..

ఆమిర్ ఖాన్ తనెలా తగ్గారనే విషయమై రోజువారీ ఆహార పట్టికను అయితే వెల్లడించలేదు కానీ తను పాటిస్తున్న యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ డైట్ వల్ల 18 కిలోల బరువు తగ్గడంతో పాటు మైగ్రేన్ సమస్య కూడా గణనీయంగా తగ్గిందని తెలిపారు. ఈ ఆహార విధానం అందరికీ ఒకలాంటి రిజల్టే ఇవ్వకపోవచ్చు. కానీ మధుమేహం, కిడ్నీ సమస్యల వంటివి ఉన్నవారు కొత్త డైట్‌ను ప్రారంభించే ముందు వైద్యుడు, లేదా పోషహాకాహార నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం.

 

 

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 9, 2026 12:13 PM