ChiruBobby2: చిరు ఎక్కడా తగ్గట్లే..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 158వ చిత్రంలో నటిస్తున్నారు. చిరు, బాబీ కొల్లి కాంబోలో రూపొందుతున్న రెండవ చిత్రమిది. ఈ సినిమా కోసం చిరు ఏమాత్రం తగ్గడం లేదు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 158వ చిత్రంలో నటిస్తున్నారు. చిరు, బాబీ కొల్లి కాంబోలో రూపొందుతున్న రెండవ చిత్రమిది. ఈ సినిమా కోసం చిరు ఏమాత్రం తగ్గడం లేదు. హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇది సినిమాకే హైలైట్‌గా నిలవనుందని టాక్. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ప్రముఖ స్టంట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో భారీ వర్షం నేపథ్యంలో ఓ గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో భారీ సంఖ్యలో ఫైటర్లు పాల్గొంటున్నారు. ఈ ఫైట్ చిరంజీవి కెరీర్‌లో కూడా అత్యంత భారీ యాక్షన్ సన్నివేశాల్లో ఒకటిగా నిలవనుంది. ఈ షూటింగ్‌లో చిరంజీవి చూపించిన అంకితభావం ప్రస్తుతం చిత్రబృందాన్ని ఆశ్చర్యపరిచింది.
నిన్న షెడ్యూల్ లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10గంటల వరకూ షూట్ చేశారు. మధ్యలో గంట లంచ్ బ్రేక్ తీసుకున్నారు తప్పితే మిగతా 12 గంటల పాటు వర్షంలోనే తడుస్తూ ఏకధాటిగా షూటింగ్ చేశారు. ఏమాత్రం అలసట లేకుండా అదే ఉత్సాహంతో యాక్షన్ సన్నివేశాలను చేయడం యూనిట్ మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. మొదటి షాట్ నుంచి చివరి షాట్ వరకు అదే ఎనర్జీ. అదే కమిట్‌మెంట్‌తో ప్రతి సన్నివేశాన్ని పూర్తి చేశారు మెగాస్టార్. ఆయన చూపించిన క్రమశిక్షణ, అంకితభావం చిత్రబృందంలోని ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఇది భారతీయ సినిమా రంగంలో అత్యంత కష్టపడి పనిచేసే స్టార్లలో ఒకరిగా ఆయన ఖ్యాతిని ఈ షెడ్యూల్ మరోసారి నిరూపించింది.
ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ భారీ రెయిన్ ఫైట్ సినిమా హైలైట్‌గా నిలిచి, ప్రేక్షకులకు థియేటర్లలో అద్భుతమైన అనుభూతిని అందించనుంది. షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, త్వరలోనే సినిమా టైటిల్ టీజర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సంగీతాన్ని ఎస్. థమన్ అందిస్తున్నారు. భారీ యాక్షన్, బలమైన భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రతిష్టాత్మకమైన తెలుగు చిత్రాల్లో ఒకటిగా ఇది నిలవనుందని టాక్.