నెల పాటు జైల్లో ఉంటే సీఎం పోస్ట్ హూస్ట్.. అది చట్టంగా మారిందా ఇక అంతే..!
ఈ బిల్లు ఓకే అయ్యిందో కంప్లీట్‌గా దేశంలో బీజేపీ ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారుతుందనడంలో సందేహం లేదేమో. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రేవశపెట్టాలనుకుంటున్న బిల్లు ఏంటంటే..
ఎన్డీఏ ప్రభుత్వం దేశ చరిత్రను మార్చే ఒక కీలక బిల్లును ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. అదే 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ బిల్లు ఓకే అయ్యిందో కంప్లీట్‌గా దేశంలో బీజేపీ ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారుతుందనడంలో సందేహం లేదేమో. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రేవశపెట్టాలనుకుంటున్న బిల్లు ఏంటంటే.. ఏదైనా తీవ్ర నేరాల ఆరోపణలపై దేశ ప్రధాని కానీ, ఏదైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అరెస్టయి.. 30 రోజులకు పైగా జైల్లో ఉంటే వారు ఆటోమేటిక్‌గా తమ పదవులను కోల్పోతారు. వాస్తవానికి ఈ బిల్లును 2025 వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టారు. కానీ ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవడంతో దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) పరిశీలనకు పంపారు. కమిటీ నుంచి నివేదిక అందగానే ఈ చట్టాన్ని ఆమోదించాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఇదేమీ ఆషామాషీ బిల్లు కాదు. రాజ్యాంగ సవరణ బిల్లు.
మరి అలాంటి కీలక బిల్లు ఊరికే చట్టంగా మారుతుందా? లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ బిల్లుకు మద్దతు కావాల్సి ఉంది. ఓటు వేసే సభ్యుల్లో కనీసం మూడింట రెండొంతుల (2/3) మంది మద్దతు కచ్చితంగా అవసరం. గతేడాది కంటే ప్రస్తుతం పార్లమెంట్‌లో రాజకీయ సమీకరణాలు అధికార ఎన్డీయే కూటమికి అనుకూలంగా ఉన్నాయి. ఈ బిల్లు.. చట్టం కావడం పెద్ద విషయమేమీ కాదు. లోక్‌సభలో శివసేన(షిండే)కు చెందిన కొందరు ఎంపీల మద్దతు ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. దీంతో ఎన్డీయే బలం సుమారు 330 సీట్లకు పెరిగింది. అయినా కూడా కొంత తగ్గుతుందనే చెప్పాలి. అయితే టీఎంసీ సభ్యుల మద్దతు కూడా ఎన్డీఏకు లభించే అవకాశం ఉంది. ఇక రాజ్యసభలో 242 మంది ఎన్డీఏకు సభ్యులుండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు కొందరు బీజేపీలో చేరడంతో ఎన్డీఏ బలం 141కి చేరింది. నామినేటెడ్, స్వతంత్ర సభ్యుల మద్దతు కలిపినా ఎన్డీయే బలం 151 స్థానాల వద్దే ఆగిపోడంతో ప్రత్యేక మెజారిటీకి మరో 11 ఓట్లు అవసరం ఉంది.
ఈ బిల్లు చట్టంగా మారితే కేంద్ర ప్రభుత్వం తను అధికారంలో లేని రాష్ట్రాలను చెడుగుడు ఆడే అవకాశం ఉంది. దీనికి కారణం లేకపోలేదు. ఒకవేళ ఈ బిల్లు చట్టమైతే.. కేంద్రంలో ఎన్డీఏ అనే కాదు.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా లేని సీఎంలను ఏదో ఒక కారణంతో జైలుకు పంపే అవకాశం లేకపోలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అలా 30 రోజుల పాటు సీఎంను జైల్లో ఉంచగలిగితే ఆ రాష్ట్రంలోని ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం పెద్ద విషయమేమీ కాదు. కాబట్టి ఈ బిల్లు రాష్ట్రాల పాలిట శాపమే. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకున్న బిల్లులన్నీ స్వార్థంతో కూడినవేనని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. ముఖ్యంగా గతంలో అనేక కీలక బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన పార్టీలన్నీ ఇప్పుడు కూడా సపోర్ట్ దాదాపుగా ఇస్తాయనడంలో సందేహం లేదు. దీంతో కేంద్రం ప్రవేశ పెట్టే బిల్లులు సులువుగానే చట్టంగా మారే అవకాశం ఉంది. ఇక మున్ముందు ఈ బిల్లు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.