సవాల్ చేసి గన్‌పార్క్ దగ్గర కూర్చొని హరీష్‌రావును అరెస్ట్ చేయిస్తే ఎలా?
ప్రజల సమస్యలు చర్చించమని.. ప్రజలకు ఇబ్బంది లేకుండా పాలించమని అందలం ఎక్కిస్తే.. అక్కడికెళ్లేనా కొట్టుకునేడే సరిపోతోంది తెలంగాణ నేతలకు. ఏపీలో మాదిరిగా ఏ పార్టీకైనా ప్రతిపక్షమనేదే లేకుంటే బాగుంటుందేమో అని కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది.
ప్రజల సమస్యలు చర్చించమని.. ప్రజలకు ఇబ్బంది లేకుండా పాలించమని అందలం ఎక్కిస్తే.. అక్కడికెళ్లేనా కొట్టుకునేడే సరిపోతోంది తెలంగాణ నేతలకు. ఏపీలో మాదిరిగా ఏ పార్టీకైనా ప్రతిపక్షమనేదే లేకుంటే బాగుంటుందేమో అని కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది. అలా లేకుంటే ప్రభుత్వం ఆడిందే ఆట.. పాడిందే పాటవుతుందని మరోసారి అనిపిస్తుంది. పోనీ తెలంగాణలో అధికార ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై చర్చిస్తున్నాయా? అంటే సవాళ్లు - ప్రతి సవాళ్లు. వెరసి పరిస్థితి ఉద్రిక్తం. గురుకులాల్లో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
ఆ ఆరోపణలు నిజం కాదని నిరూపించుకుంటే పోయేదానికి ఏకంగా చర్చిస్తామంటూ తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ తదితరులు గన్‌పార్క్ వద్దకు చేరుకుని బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ మంత్రులు ఎవరు వచ్చినా చర్చకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇక ఇంతగా పిలిచాక బీఆర్ఎస్ నేతలు ఊరుకుంటారా? మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్ నుంచి గన్‌పార్క్‌కు బయల్దేరారు. మరి చర్చకు పిలిచి వెళ్లి గన్ పార్క్ దగ్గర కూర్చొని బీఆర్ఎస్ నేతలను రానీయకపోవడమే ఆసక్తికరంగా మారింది. హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట. మరి అధికార పార్టీ నేతలైనా తామే పిలిచాం.. సవాల్ విసిరాం కాబట్టి రానివ్వండని ఏమైనా చెప్పారా? అంటే అదీ లేదు.
పోయి చల్లగ కూర్చొని వీళ్లను మాత్రం రానివ్వలేదు. అలా చేస్తూ తప్పెవరది అవుతుంది? హాస్టళ్లలో అవినీతి జరిగిందని కేటీఆర్, హరీశ్‌రావు, ప్రవీణ్‌కుమార్ తదితరులు ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్ నేతలవి పచ్చి అబద్ధాలని... తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారనేది కాంగ్రెస్ నేతల వాదన. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ అప్పుల గురించి చర్చకు సిద్ధంగా ఉన్నట్లు బీఆర్‌ఎస్ నేతలు వెల్లడించారు. అంతా బాగానే ఉంది కానీ గన్‌పార్క్‌కు బయలుదేరిన హరీష్ రావును వెళ్లనీయకుండా అడ్డుకోవడమే కాకుండా పోలీసులు అరెస్ట్ చేయడమే ఒకింత విడ్డూరంగా ఉంది. అప్పుడు బీఆర్ఎస్ నేతలు చేసినవి ఆరోపణలు కాదు.. నిజలేనా? లేదంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం తెలంగాణలో కాకరేపుతోంది.