భాగ్యనగరవాసులు.. ఇకపై భంగీ జంప్ కోసం ఎక్కడికో వెళ్లనక్కర్లే.. హైదరాబాద్‌లోనే..
భంగీ జంప్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు చూసినప్పుడు యువత మదిలో తాము కూడా ఒకసారి భంగీ జంప్ చేస్తే బాగుంటుందనిపిస్తుంది. కానీ దానికోసం ఏ ఉత్తరాఖండో వెళ్లాల్సి వస్తోందని బాధపడేవారూ లేకపోలేదు.
భంగీ జంప్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు చూసినప్పుడు యువత మదిలో తాము కూడా ఒకసారి భంగీ జంప్ చేస్తే బాగుంటుందనిపిస్తుంది. కానీ దానికోసం ఏ ఉత్తరాఖండో వెళ్లాల్సి వస్తోందని బాధపడేవారూ లేకపోలేదు. ఇప్పుడు వారందరికీ గుడ్ న్యూస్. భంగీ జంప్ కోసం ఇకమీదట ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన హైదరాబాద్‌కలోనే భంగీ జంప్ చేయవచ్చు. నగరానికి వచ్చే.. నగరంలో వీకెండ్స్‌లో ఎటు వెళదామా? అని ఆలోచించే వారికోసం మరో కొత్త ప్రాజెక్టుకు హెచ్ఎండీఏ తీసుకురాబోతోంది. హుస్సేన్‌సాగర్ తీరాన ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్కుల్లో మరిన్ని ప్రత్యేక ఆకర్షణలతో పర్యాటకులను ఆకర్షించేందుకు ప్లాన్ చేస్తోంది.
హెచ్‌ఎండీఏలోని బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అధికారులు ఇప్పటికే దీనికోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. త్వరలోనే సందర్శకులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. కేవలం బంగీజంప్, కిడ్స్ ట్రాంపోలిన్ మాత్రమే కాకుండా ఇతర ఆకర్షణలను సైతం ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం భంగీ జంప్‌కు బాగా క్రేజ్ ఉంది. అందుకే ఎన్‌టీఆర్ గార్డెన్స్ మెయిన్ఎంట్రన్స్ వద్ద లుంబిని పార్క్‌లో బోటింగ్ టికెట్ కౌంటర్ వెనుక బంగీ ట్రాంపోలిన్, కిడ్స్ ట్రాంపోలిన్ ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టును మూడేళ్ల పాటు ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీటీడీసీ) నిర్వహించనుంది. ముందుగా టెండర్ ద్వారా సంస్థను ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలోనే బంగీ ట్రాంపోలిన్, కిడ్స్ ట్రాంపోలిన్ ఏర్పాటు, నిర్వహణ, మెయింటెనెన్స్ వంటి బాధ్యతలను ఎంపికైన సంస్థకే అప్పగించనున్నారు.