others

సండే కదాని డీమార్ట్‌పై దండయాత్ర చేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే..

సండే వచ్చింది కదాని.. లేదంటే ఫ్రీ టైమ్ దొరికింది కదాని.. డీమార్ట్‌ పేరిట హైపర్ మార్కెట్లు నిర్వహించే అవెన్యూ సూపర్‌‌‌‌‌‌‌‌మార్ట్స్‌పై దండయాత్ర చేస్తున్నారా? అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకుని తీరాల్సిందే.

సండే కదాని డీమార్ట్‌పై దండయాత్ర చేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే..

సండే వచ్చింది కదాని.. లేదంటే ఫ్రీ టైమ్ దొరికింది కదాని.. డీమార్ట్‌ పేరిట హైపర్ మార్కెట్లు నిర్వహించే అవెన్యూ సూపర్‌‌‌‌‌‌‌‌మార్ట్స్‌పై దండయాత్ర చేస్తున్నారా? అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకుని తీరాల్సిందే. ఎందుకంటే మీరు చేసిన దండయాత్ర కారణంగా అవెన్యూ సూపర్‌‌‌‌‌‌‌‌మార్ట్స్ ఎంతలా లాభపడ్డాయో తెలిస్టే షాక్ అవుతారు. అవెన్యూ సూపర్‌‌‌‌‌‌‌‌మార్ట్స్ తాజాగా తన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి క్వార్టర్‌లో లాభాలను ప్రకటించింది. మొదటి క్వార్టర్‌లో 11.33 శాతం వృద్ధితో రూ.860.44 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో కంపెనీ నికర లాభం రూ.772.81 కోట్లు ఉండగా.. ఆ ఆదాయం 14.9 శాతం పెరిగి ప్రస్తుతం షాకింగ్ స్థాయిలో పెరిగింది.

అంటే ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో అవెన్యూ సూపర్‌మార్ట్స్ లాభం రూ.18,794.53 కోట్లకు చేరుకుంది. మొత్తం ఖర్చులు 15.11 శాతం పెరిగి రూ.17,637.17 కోట్లుగా నమోదయ్యాయి. ఈ క్వార్టర్‌లో డీమార్ట్​ కొత్తగా మూడు స్టోర్లను ప్రారంభించింది. దీంతో అవెన్యూ సూపర్‌మార్ట్స్ మొత్తం స్టోర్ల సంఖ్య 503 కు చేరింది. ఆన్‌‌‌‌‌‌‌‌‌లైన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ డీమార్ట్ రెడీ వ్యాపారం సేవలు మొత్తంగా 18 నగరాల్లో అందిస్తుండగా.. ఏడు నగరాల్లో తక్కువ ఆదాయం ఉన్న కారణంగా నిలిపివేసింది. ప్రస్తుతం డీమార్ట్ రెడీ 11 నగరాల్లో సేవలు అందిస్తోంది. అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ను రాధాకిషన్ దమానీ కుటుంబం ప్రమోట్ చేస్తోంది. ఈ సంస్థ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సేవలందిస్తోంది.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 12, 2026 5:50 AM