Entertainment

సుప్రసిద్ద గాయని ఎస్ జానకి ఇక లేరు..

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సుప్రసిద్ధ గాయని ఎస్‌.జానకి (88) మైసూర్‌లో గుండెపోటుతో మరణించారు. వయోభారంతో ఇబ్బందిపడుతున్న జానకిని కుటుంబ సభ్యులు మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చగా..

సుప్రసిద్ద గాయని ఎస్ జానకి ఇక లేరు..

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సుప్రసిద్ధ గాయని ఎస్‌.జానకి (88) మైసూర్‌లో గుండెపోటుతో మరణించారు. వయోభారంతో ఇబ్బందిపడుతున్న జానకిని కుటుంబ సభ్యులు మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చగా.. అక్కడ ఆమె చికిత్స పొందుతూ శనివారం(జూలై 11) సాయంత్రం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. జానకి మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు ఆమె మృతి సంతాపం తెలుపుతున్నారు. జానకి సినీ ఇండస్ట్రీలో గాయనిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సుమారు 50 వేలకుపైగా పాటలు పాడారు. తొలి తరం ఘంటసాల నుంచి మలితరం బాలసుబ్రమణ్యంతో కలిసి ఎన్నో అద్భుత గీతాలను ఆలపించారు. ఉత్తమ గాయనిగా 4 సార్లు జాతీయ పురస్కారం, 2013లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్‌తో సత్కరించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, రేపల్లె సమీపంలోని పల్లపట్ల గ్రామంలో జానకి 1938 ఏప్రిల్ 23న జన్మించారు. చిన్నతనం నుంచే ఆమెకు సంగీతంపై మక్కువ ఎక్కువ. దీంతో ఆమె నాదస్వరం విద్వాంసుడు పైడిస్వామి వద్ద ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నారు. 1957లో తమిళ చిత్రం 'విధియిన్ విలయాత్తు' ద్వారా నేపథ్య గాయనిగా జానకి తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అదే ఏడాది 'ఎమ్మెల్యే' చిత్రంలో 'నీతియే జయమవునురా' అనే పాట పాడారు. చిన్న పిల్లల గొంతు నుంచి ముసలివారి వరకూ ఏ వయసు పాత్రకైనా సరిపోయేలా తన గళాన్ని సవరించుకోగలగడం జానకి ప్రత్యేకత. ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె పాడిన యుగళ గీతాలు భారతీయ సంగీత చరిత్రలో ఎవర్ గ్రీన్‌గా మిగిలిపోతాయనడంలో అతిశయోక్తి లేదు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 11, 2026 3:20 PM