Entertainment

ఏపీ ముఖ్యమంత్రి రమ్యకృష్ణా? ఇదేం ట్విస్ట్?

ఒకప్పుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ‘క్వీన్’ అనే వెబ్ సిరీస్ వచ్చింది. దానిలో తమిళనాడు ఒకప్పటి ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ఇప్పుడు రమ్యకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అట.

ఏపీ ముఖ్యమంత్రి రమ్యకృష్ణా? ఇదేం ట్విస్ట్?

ఒకప్పుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ‘క్వీన్’ అనే వెబ్ సిరీస్ వచ్చింది. దానిలో తమిళనాడు ఒకప్పటి ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ఇప్పుడు రమ్యకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అట. అదేంటి అంటారా? ఆసక్తికర విషయం ఏంటంటే.. దీని టైటిల్ కూడా ‘క్వీన్’. ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ యామినీ ఈఆర్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రతన్ రిషి తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్ సెంట్రిక్ కథతో "క్వీన్" మూవీ రూపొందుతోంది. వాస్తవానికి జయలలిత జీవితాధారంగా వచ్చిన ‘క్వీన్’ ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసింది. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందనేది చూడాలి.

ఈ సినిమాను వన్ సర్కిల్ ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్‌గా నటిస్తుండగా.. హీరోయిన్ తండ్రి పాత్రలో సాయి కుమార్ కనిపించనున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ చేశారు. అదేంటంటే.. ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్, స్ట్రాంగ్ క్యారెక్టర్‌లో ప్రముఖ నటి రమ్యకృష్ణ నటిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతిగా ఆమె కనిపించనున్నారు. రమ్యకృష్ణ తమ ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుతున్న సందర్భంగా చిత్రబృందం ఒక పోస్టర్‌తో ఆమెకు స్వాగతం పలికింది. "క్వీన్" చిత్రాన్ని వాస్తవ ఘటనల ఆధారంగా, రియల్ క్యారెక్టర్స్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఫిక్షనల్ స్టోరీతో దర్శకుడు రతన్ రిషి తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. 2006-2010 మధ్య కాలంలో ఈ చిత్ర కథ కొనసాగనుంది. ప్రస్తుత సొసైటీ‌తో ముడిపడి ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ లవ్‌స్టోరీని ఈ చిత్రంలో చూపించనున్నట్టు తెలుస్తోంది. శరవేగంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 11, 2026 1:37 PM