ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్.. ఇంటర్మీడియట్ అర్హతతో..
ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. హెటెరో సంస్థ వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో 300 మందికి పైగా అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు హెటిరో సంస్థ ప్రకటించింది.
ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. హెటెరో సంస్థ వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో 300 మందికి పైగా అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు హెటిరో సంస్థ ప్రకటించింది. ఇంటర్ విద్యాశాఖ సహకారంతో హెటెరో సంస్థ ఈ నియామకాలు చేపట్టనుంది. హెటిరో సంస్థకు చెందిన తయారీ కేంద్రాల్లో ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది.
ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయమై శుక్రవారం ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్‌తో హెటెరో ప్రతినిధులు వెంకటజయపాల్‌రెడ్డి, అల్లా శ్రీనివాస్, మాధురి సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే అభ్యర్థులందరికీ ఉద్యోగంత పాటు దానికి అవసరమైన శిక్షణ కూడా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే జాబ్ మేళాల ద్వారా 70 మందిని ఎంపిక చేసిన సంస్థ.. ఇకపై ఈ సంఖ్యను 300 దాటించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రాష్ట్రంలోని స్థానిక ప్రతిభను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.