ప్రెగ్నెంట్‌తో ఉన్న సమంతకు గుడ్ న్యూస్ చెప్పిన భర్త రాజ్
ప్రెగ్నెంట్‌తో ఉన్న మహిళలు సంతోషంగా ఉండాలని అంటారు. ప్రస్తుతం సమంత ప్రెగ్నెంట్. ఆమె ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉంది. దీని కారణం భర్త రాజ్ నిడిమోరు ఇచ్చిన సర్‌ప్రైజ్.
ప్రెగ్నెంట్‌తో ఉన్న మహిళలు సంతోషంగా ఉండాలని అంటారు. ప్రస్తుతం సమంత ప్రెగ్నెంట్. ఆమె ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉంది. దీని కారణం భర్త రాజ్ నిడిమోరు ఇచ్చిన సర్‌ప్రైజ్. అదే ‘మా ఇంటి బంగారం’ ఇచ్చిన కిక్. ఈ చిత్రం రూ.100 కోట్ల బరిలో నిలిచింది. ఇది మాత్రమే కాదు.. మరో హ్యాపీ న్యూస్ కూడా ఉంది. అదేంటో కూడా తెలుసుకుందాం. లేటెస్ట్‌గా సమంత నటించిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద నయా రికార్డులు క్రియేట్ చేసింది. జూన్ 19న విడుదలైన ఈ సినిమా.. కేవలం 24 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లను ఈ చిత్రం రాబట్టి సమంతకు బీభత్సమైన ఆనందాన్నిచ్చింది. దీనిని ఆమె భర్త రాజ్ నిడిమోరు ఆమె బెడ్‌పై కూర్చొని ఉండగా ఒక ట్యాబ్ ఆమె చేతికిచ్చి మరీ దానితో సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిందన్న విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు.. మరో విశేషమేంటంటే.. టాలీవుడ్ సినీ చరిత్రలోనే ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రంగా ఇది అరుదైన భారీ రికార్డును సమంత సొంతం చేసుకుంది.
ఇక మరో హ్యాపీ న్యూస్ కూడా ఉందనుకున్నాం కదా అదేంటంటే.. ఇప్పడు థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘మా ఇంటి బంగారం‘ ఓటీటీ ప్రియులను అలరించేందుకు డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేస్తోంది. ఈ క్రమంలోనే మేకర్స్ ఈ సినిమా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను సైతం అనౌన్స్ చేసేశారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను భారీ ధరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) సొంతం చేసుకుంది. సినిమా స్ట్రీమింగ్ రైట్స్ కోసం హాట్‌స్టార్ భారీ ధర పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడో కాదు... ఈ నెల 17 నుంచే ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. అయితే ప్రస్తుతానికి కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే ప్రీమియర్‌కు లాక్ చేయబడింది. అయితే ఈ సినిమా త్వరలోనే మిగిలిన దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేసే అవకాశాలున్నాయని టాక్. ఈ చిత్రానికి సమంత భర్త రాజ్ నిడిమోరు కథను అందించారు. నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సమంత తన సొంత బ్యానర్ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్‌పై నిర్మించింది.