ప్రముఖ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్ Vs జానీ మాస్టర్.. బిగ్ ఫైట్
ప్రముఖ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం కొట్టుకునే వరకూ వెళ్లింది. దీంతో అసోసియేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసలేం జరిగిందంటే..
ప్రముఖ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం కొట్టుకునే వరకూ వెళ్లింది. దీంతో అసోసియేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసలేం జరిగిందంటే.. అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల నమోదు, అంతర్గత పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల అమలు వంటి అంశాలపై ఇప్పటికే ఇరువర్గాల మధ్య అభిప్రాయ భేదాలున్నాయి. అవి కాస్తా ప్రస్తుతం తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే ఆరోపణలు, ప్రత్యారోపణలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇటీవల జానీ మాస్టర్ వర్గం అసోసియేషన్‌లో కొన్ని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వాటిని ఫెడరేషన్ దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో సభ్యులు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. తమ తమ నాయకులకు మద్దతు తెలియజేస్తూ వాగ్వాదానికి దిగుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆసక్తికరంగా ఈ వివాదంలో జానీ మాస్టర్ భార్య, అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుండటం గమనార్హం. అసోసియేషన్ వ్యవహారాల్లో జానీ మాస్టర్ భార్య సుమలత ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కొందరు డ్యాన్సర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఫెడరేషన్ అనుమతి కూడా లేకుండానే బైఎలక్షన్ నిర్వహించేందుకు ప్రయత్నాలు జరిగాయట. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో అసోసియేషన్‌కు చెందిన దాదాపు పది మంది డ్యాన్సర్లు రాజీనామా చేశారని కూడా తెలుస్తోంది. ఈ ఆరోపణలన్నింటిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.