బన్నీ@4.. కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్.. తాత, తండ్రి, ఇద్దరు కొడుకులు..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి చెప్పేదేముంది? ఏదైనా ఛాలెంజ్‌గా తీసుకుని చేసేస్తాడు. ‘పుష్ప’తో ఇంటర్నేషనల్ లెవల్‌లో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ చేస్తున్నాడు. ఈ ‘రాకా’ స్పెషాలిటీ అంతా ఇంతా కాదు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి చెప్పేదేముంది? ఏదైనా ఛాలెంజ్‌గా తీసుకుని చేసేస్తాడు. ‘పుష్ప’తో ఇంటర్నేషనల్ లెవల్‌లో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ చేస్తున్నాడు. ఈ ‘రాకా’ స్పెషాలిటీ అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ తీసుకున్నాడని టాక్. అదేంటో తెలిస్తే షాక్ అవుతారు. అట్లీ ఈ సినిమాను చాలా ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్‌గా అట్లీ తెరకెక్కిస్తున్నారు. పారలల్ యూనివర్స్ నేపథ్యంలో సాగే సైన్స్-ఫిక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు భారీ బడ్జెట్ కేటాయించారని టాక్. సుమారు రూ. 800-1000 కోట్ల వరకు నిర్మాతలు బడ్జెట్ కేటాయించారట. అలాంటి ఈ చిత్రంలో బన్నీ ఏకంగా నాలుగు పాత్రల్లో కనిపించనున్నాడని టాక్.
విజువల్ వండర్‌గా మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తాత, తండ్రి, ఇద్దరు కొడుకుల పాత్రల్లో బన్నీ మెప్పించనున్నాడని తెలుస్తోంది. కొడుకులు అంటే ఓకే కానీ తాత, తండ్రిగా కనిపించడమే ఒకింత ఆశ్చర్యం వేస్తోంది. అయితే దీనిని బన్నీ మాత్రం ఎలాంటి ఇగోకి వెళ్లకుండా ఛాలెంజ్‌గా తీసుకున్నాడని సమాచారం. ఈ సినిమా రిలీజ్ డేట్ అట్లీ ఇప్పటి వరకైతే చెప్పలేదు కానీ 2027లో పుష్పరాజ్ వస్తాడని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ 2027లో రాక రావడం కష్టమేనని టాక్. దీనికి కారణం.. ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్స్‌కు తగినట్టుగా రూపొందించడమే. అట్లీ మేకింగ్ స్టైల్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇప్పటికే ఆయన పలు చిత్రాలతో తనను తాను ప్రూవ్ చేసుకున్నారు కూడా. ఇక బన్నీతో తెరకెక్కిస్తున్న రాకాను మరింత ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తున్నారట. దీని కోసం ఎక్కడా రాజీ పడటం లేదట. ఈ క్రమంలోనే టైం తీసుకుని మరీ సినిమాను ఇంటర్నేషనల్ లెవల్లో తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా సినిమాను విజువల్ వండర్‌గా వీఎఫ్ఎక్స్, సీజీఐ టీంకి ఎక్కువ టైం కేటాయిస్తున్నారని టాక్. అలాగే దీపికా ప్రెగ్నెన్నీ కారణంగా కూడా షూటింగ్ కొంత ఆలస్యమైందని తెలుస్తోంది. ఈ కారణాలన్నింటితో సినిమా బాగా డిలే అవుతుందట. అందుకే మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించడం లేదని తెలుస్తోంది. 2028లో రాకా థియేటర్స్‌లోకి రావొచ్చని చెబుతున్నారు.