షాకింగ్ న్యూస్.. కల యువతిని చంపేసింది.. ఎక్కడో కాదు.. హైదరాబాద్‌లోనే..
ఒక కల మనిషిని చంపేస్తుందా? అంటే ఇది చదివాక చంపేస్తుందనే చెబుతారు. హైదరాబాద్‌లో ఓ యువతిని కల చంపేసింది. అర్ధరాత్రి నిద్ర లేచిన యువతి.. అర్ధ నగ్నంగా పరిగెత్తుకుంటూ వెళ్లి చెరువులో దూకి చనిపోయింది.
ఒక కల మనిషిని చంపేస్తుందా? అంటే ఇది చదివాక చంపేస్తుందనే చెబుతారు. హైదరాబాద్‌లో ఓ యువతిని కల చంపేసింది. అర్ధరాత్రి నిద్ర లేచిన యువతి.. అర్ధ నగ్నంగా పరిగెత్తుకుంటూ వెళ్లి చెరువులో దూకి చనిపోయింది. సదరు యువతికి క్యాంపస్ సెలక్షన్స్‌లోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. ఆల్ హ్యాపీ అనుకుంటూ ఉద్యోగంలో చేరాక కానీ తెలియలేదు. విపరీతమైన ఒత్తిడి. భరించలేక ఇంటికే పరిమితమైంది. చివరకు నగ్నంగా వెళ్లి చెరువులో దూకేసింది. హైదరాబాద్‌లోని మేడిపల్లిలో ఈ ఘటన వెలుగు చూసింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా దేవపల్లికి చెందిన వక్కులగడ్డి ఈశ్వర్ రావు, అరుణ దంపతుల కుమార్తె అయిన తేజస్విని (25) బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేసేది. విధుల్లో తీవ్రమైన ఒత్తిడి. ఇక భరించలేక ఆరు నెలల క్రితం ఉద్యోగం మానేసి విశాఖపట్నంలోని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోయింది. రెండు నెలల క్రితం తల్లి అరుణతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి.. పీర్జాధిగూడలోని శంకర్‌నగర్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుంది. మియాపూర్‌కు షిఫ్ట్ అవుదామనుకున్న తల్లీకూతుళ్లు మియాపూర్‌లో రూమ్ కోసం శుక్రవారమంతా వెతికారు. శుక్రవారం రాత్రి పీర్జాదిగూడలోని తమ ఇంటికి చేరుకుని పడుకున్నారు. ఏమైందో ఏమో కానీ అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో తేజస్విని నిద్రలేచి తల్లి ఉండే గదికి బయటి నుంచి తాళం వేసి.. చేతిలో చీర పట్టుకుని నగ్నంగా వీధుల్లోకి పరుగెత్తింది.
మార్గం మధ్యలో స్థానిక బీరప్ప గుడి దగ్గర ఆగింది. అక్కడి ఆలయంలోని దేవుడికి మొక్కి తిరిగి.. నగ్నంగానే పరిగెడుతూ పీర్జాధిగూడలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవడంతో ఈ విషయం వెలుగుచూసింది. తల్లి ఉదయం నిద్రలేచి చూసేసరికి ఇంటి తలుపులకు తాళం వేసి ఉంది. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి తలుపులు తీశారు. తేజస్విని కోసం వెతకగా చెరువులో శవంగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాల సాయంతో తేజస్విని మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తల్లిని పోలీసులు విచారించగా.. తమ కుమార్తెకు తరచుగా పీడకలలు వస్తున్నాయని చెప్పేదన్నారు. మానసిక సమస్యలతోనే ఆత్మహత్య చేసుకుందని తల్లి మేడిపల్లి పోలీసులకు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిర్వహించగా.. మృతురాలు ఫియర్ ఫోబియాతో బాధపడేదని తేలింది.