Politics

నెట్టింటిని వీడి.. ఢిల్లీని గడగడలాడిస్తున్న ‘కాక్రోచ్’..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఫుల్ యాక్టివ్ అయిపోయింది. నెట్టింటి నుంచి బయటకు వచ్చి.. ఆందోళనలకు తెరదీస్తోంది. తాజాగా ఢిల్లీ జంతర్ మంతర్ దీక్షా స్థలి దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన ఆందోళనతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

నెట్టింటిని వీడి.. ఢిల్లీని గడగడలాడిస్తున్న ‘కాక్రోచ్’..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఫుల్ యాక్టివ్ అయిపోయింది. నెట్టింటి నుంచి బయటకు వచ్చి.. ఆందోళనలకు తెరదీస్తోంది. తాజాగా ఢిల్లీ జంతర్ మంతర్ దీక్షా స్థలి దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన ఆందోళనతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 20 రోజులకు పైగా నిరధిక నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణ వేత్త సోనం వాంగ్‌ చుక్‌ను పోలీసులు దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. దీంతో సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఆమరణ దీక్షకు కూర్చున్నారు. వెంటనే పోలీసులు దీక్షా స్థలిని చుట్టుముట్టారు. ఈ తరుణంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రేపటి (సోమవారం జులై 20) నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు నుంచి కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంటుకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు దీక్షా స్థలి వద్ద మోహరించినట్టుగా కాక్రోచ్ జనతా పార్టీ భావిస్తోంది. మరోవైపు జంతర్ మంతర్ దగ్గర సాయంత్రం 7 గంటల తర్వాత దీక్షకు అనుమతి లేదని.. తక్షణమే ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. సోనమ్ వాంగ్ చుక్‌ను తరలించే ముందు కూడా ఇలాగే భారీ ఎత్తున పోలీసులు దీక్షా స్థలిని చుట్టుముట్టారు. ప్రస్తుతం కూడా పోలీసులు పెద్ద ఎత్తున దీక్షా స్థలి వద్ద మోహరించడంతో సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కేను సైతం అక్కడి నుంచి తరలించనున్నట్లు భావిస్తున్నారు. దీప్కేతో పాటు వివిధ విద్యార్థి సంఘాల నేతలను సైతం అక్కడి నుంచి తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తమ్మీద ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తన కార్యకలాపాలను మరింత వేగవంతం చేస్తోంది. ఇప్పటి వరకు ప్రధానంగా సోషల్ మీడియాలో తన వినూత్న ప్రచారంతో గుర్తింపు పొందిన ఈ పార్టీ.. ఇప్పుడు నేరుగా ప్రజా ఉద్యమాల బాట పట్టింది. పర్యావరణ పరిరక్షణ, ప్రజాస్వామ్య హక్కుల అంశాలపై వరుస ఆందోళనలకు శ్రీకారం చుడుతోంది. సోషల్ మీడియా ప్రచారం నుంచి ప్రత్యక్ష ఉద్యమాల దిశగా అడుగులు వేస్తున్న సీజేపీ.. ఈ ఆందోళనతో మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 19, 2026 4:05 PM