ఐకానిక్ ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలివే..
ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్ పండగ ఫిఫా వరల్డ్ కప్ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో ఐకానిక్ వరల్డ్ కప్ ట్రోఫీ ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్ పండగ ఫిఫా వరల్డ్ కప్ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో ఐకానిక్ వరల్డ్ కప్ ట్రోఫీ ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. న్యూజెర్సీ వేదికగా జరగబోయే హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ముద్దాడే ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. ఈ ఐకానిక్ ట్రోఫీ చూసేందుకు చాలా అందంగా ఉంది. ఇక దీని బరువు 6.142 కేజీలు (సుమారు 13.5 పౌండ్లు) ఉంటుంది. ఈ ట్రోఫీకి సంబంధించి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ట్రోఫీ మొత్తం బరువులో ఏకంగా 5.092 కేజీలు కేవలం ప్యూర్ గోల్డ్ కావడం విశేషం.
ఎప్పుడైనా సరే.. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కొత్త ఛాంపియన్‌గా నిలిచిన దేశం పేరును ట్రోఫీ కింద ఉండే ఒక ప్రత్యేకమైన డిస్క్‌పై రాయడం ఆనవాయితీ. అనంతరం ఈ బాటమ్ డిస్క్‌ను తొలగిస్తారు. దానిని జ్యూరిచ్‌లోని ఫిఫా మ్యూజియం కలెక్షన్‌లో భద్రపరుస్తారు. అంతేకాకుండా మళ్లీ సరికొత్త చరిత్రను తిరగ రాయడం కోసం ట్రోఫీ కింద మరో సరికొత్త డిస్క్‌ను అమర్చుతారు. 1974కు పూర్వం విజేతలకు జూల్స్ రిమెట్ ట్రోఫీ (Jules Rimet Trophy)ని అందించేవారు. అయితే 1970లో బ్రెజిల్ జట్టు మూడోసారి వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే అప్పటి రూల్స్ ప్రకారం ఆ ఒరిజినల్ ట్రోఫీని శాశ్వతంగా తమ వద్దే ఉంచుకునే అవకాశాన్ని బ్రెజిల్ దక్కించుకుంది. ఆ తర్వాతే ఈ సరికొత్త బంగారు ట్రోఫీని డిజైన్ చేయడం జరిగింది.
ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని టచ్ చేసేందుకు మూడు వర్గాల ప్రజలకు తప్ప వేరే ఎవ్వరికీ అనుమతి లేదు. దీనిపై చాలా కఠిన నిబంధనలున్నాయి. ఆ మూడు వర్గాలెవరంటే.. 1. ఫిఫా ప్రెసిడెంట్, 2. వరల్డ్ కప్ విజేతలు (ఆటగాళ్లు, కోచ్‌లు), 3. వివిధ దేశాల అధినేతలు (వారు దేశ ప్రెసిడెంట్‌లు కావొచ్చు లేదంటే రాజులు కావొచ్చు). వీరు తప్ప మరెవరైనా ఈ ట్రోఫీని నేరుగా టచ్ చేయకూడదు. చేతులకు గ్లోవ్స్ ధరించి మాత్రమే ముట్టుకోవచ్చు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో కప్ కొట్టిన ఆనందంలో ఆటగాళ్లు ముద్దాడే ఆ ఒరిజినల్ సాలిడ్ గోల్డ్ ట్రోఫీని గెలిచిన దేశాలు తమ దేశానికి తీసుకెళ్లలేవు. అది ఎప్పటికీ స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ ఫిఫా మ్యూజియంలోనే సేఫ్‌గా ఉంటుంది. దానికి బదులుగా, విజేతగా నిలిచిన జట్టుకు అసలు ట్రోఫీని పోలిన నకిలీ ట్రోఫీ అంటే రెప్లికాని శాశ్వతంగా అందజేస్తారు.