others

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 240 పోస్టులకు నోటిఫికేషన్

ఎంతోకాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ రానే వచ్చింది. అది కూడా హైదరాబాద్‌లోనే ఉద్యోగావకాశం.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 240 పోస్టులకు నోటిఫికేషన్

ఎంతోకాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ రానే వచ్చింది. అది కూడా హైదరాబాద్‌లోనే ఉద్యోగావకాశం. సనత్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తెలంగాణ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 240 పోస్టులను కాంట్రాక్ట్, గౌరవ వేతన ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.

ఈ నియామకాలు ఎప్పటి వరకూ అమలు కానున్నాయో తేదీతో సహా వివరించారు. 2027 మార్చి 31, వరకు లేదా రెగ్యులర్ పోస్టులు భర్తీ అయ్యే వరకూ అమల్లో ఉంటాయి. ఏయే పోస్టులకు నోటిఫికేషన్ వెలువడిందో కూడా తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా అత్యధికంగా 144 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, 14 ఫార్మాసిస్ట్ గ్రేడ్-2, 48 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, 12 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-1, 6 మెడికో సోషల్ వర్కర్ గ్రేడ్-2, 16 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 16, 2026 3:45 AM