Entertainment Breaking News

ఘనంగా పోసాని కృష్ణమురళి "ఆపరేషన్ అరుణారెడ్డి" ప్రీ రిలీజ్ ఈవెంట్

ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా "ఆపరేషన్ అరుణారెడ్డి". ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలు కూడా పోసాని కృష్ణమురళి వహిస్తుండటం విశేషం.

ఘనంగా పోసాని కృష్ణమురళి "ఆపరేషన్ అరుణారెడ్డి" ప్రీ రిలీజ్ ఈవెంట్

ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా "ఆపరేషన్ అరుణారెడ్డి". ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలు కూడా పోసాని కృష్ణమురళి వహిస్తుండటం విశేషం. హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, బీజేపీ నేత రఘునందన్ రావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 17న "ఆపరేషన్ అరుణారెడ్డి" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ మహదేవ్ ఏలేందర్ మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రాన్ని పోసాని గారు ఎంతో ప్లానింగ్ తో రూపొందించారు. ఎన్నో వెర్షన్స్ స్క్రిప్ట్ రాసుకున్నారు. ఆ స్క్రిప్ట్ లో డైలాగ్స్ తో పాటు లిరిక్స్ కూడా రాసుకున్నారంటే ఆయన ఎంత పక్కాగా ఈ స్క్రిప్ట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. కథ విన్నప్పుడే ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అనిపించింది. ఇది పోసాని గారికి 2.ఓ గా మారుతుందని చెప్పగలను. అన్నారు. డీవోపీ సుధాకర్ మాట్లాడుతూ.. ‘‘ఇందాక మా మ్యూజిక్ డైరెక్టర్ చెప్పినట్లు "ఆపరేషన్ అరుణారెడ్డి" సినిమా పోసాని గారికి 2.ఓ అవుతుంది. ఈ సినిమాకు వర్క్ చేసేప్పుడు పోసాని గారి దగ్గర ఎంతో నేర్చుకున్నాను. ఆయనతో నాలుగేళ్లుగా ట్రావెల్ చేస్తున్నా. నాతో కలిసి ఎప్పటికీ మూవీస్ చేయాలని పోసాని గారు ఇటీవల చెప్పారు. ఆ మాట నాకెంతో సంతోషాన్నిచ్చింది’’ అన్నారు.

హీరోయిన్ హిందోళ చక్రవర్తి మాట్లాడుతూ.. "ఆపరేషన్ అరుణారెడ్డి" సినిమాలో ప్రధాన పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. నవ్విస్తుంది, ఆలోచింపజేస్తుంది, మన సొసైటీని రిఫ్లెక్ట్ చేసేలా ఉంటుంది. ఈ నెల 17న థియేటర్స్ కు వెళ్లి మా సినిమా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. సెకండ్ లీడ్ రోల్ కాజల్ శర్మ మాట్లాడుతూ "ఆపరేషన్ అరుణారెడ్డి" సినిమాలో అరుణారెడ్డి స్నేహితురాలి పాత్రలో నటించాను. ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ కు వస్తోంది. పాజిటివ్ మౌత్ టాక్ తోనే ఈ సినిమా బాగా పేరు తెచ్చుకుంటుందని నమ్ముతున్నాను. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కరూ మా మూవీ గురించే మాట్లాడుకుంటారు. అలాంటి సెన్సేషన్ ను మా మూవీ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాను. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన పోసాని గారికి కృతజ్ఞతలు’’ అన్నారు.

ప్రొడ్యూసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘పోసాని కృష్ణమురళి నాకు మంచి మిత్రులు. ఆయన ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు నేనూ భాగమవ్వాలని ముందుకొచ్చా. మా కాంబినేషన్ లో ఇక నుంచి ఏడాదికి రెండు సినిమాలు చేయబోతున్నాం. "ఆపరేషన్ అరుణారెడ్డి" ఒక మంచి మూవీ. మీ అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. నటుడు, దర్శక, నిర్మాత పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ -‘‘ మా సినిమా ఇంత త్వరగా షూటింగ్ చేసుకుని రిలీజ్ కు వస్తోందంటే కారణం నా మిత్రుడు శ్రీనివాస్. ఆయన అందించిన సహకారం వల్లే అనుకున్న టైమ్ కు సినిమాను రిలీజ్ చేస్తున్నా. నేను రైటర్ గా వంద చిత్రాలు రాశాను. నటుడిగా వందలాది చిత్రాల్లో నటించాను. దర్శక నిర్మాతగా సినిమాలు తెరకెక్కించాను. నేను చేసిన అన్ని చిత్రాల్లో "ఆపరేషన్ అరుణారెడ్డి" కు బెస్ట్ స్క్రీన్ ప్లే ఇచ్చానని చెప్పగలను. ఈ సినిమా రూపొందించిందుకు గర్వంగా ఉంది. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఏం జరుగుతుందో ఊహించలేరు. ఈ సినిమాలో ఒక్క బూతు గానీ, ఒక్క అసభ్యమైన సన్నివేశం గానీ ఉండదు. ఎంతో సిన్సియర్ గా ఈ సినిమాను రూపొందించాను. "ఆపరేషన్ అరుణారెడ్డి" సినిమా ప్రేక్షకులందరికీ బాగా నచ్చుతుందని నమ్ముతున్నా’’ అన్నారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 15, 2026 2:09 PM