Allu Arjun: ‘రింగ రింగా’ పాటేంటి? ‘ఐకాన్’ ఏంటి?’ ఏం జరుగుతోంది?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం కూడా ఒక న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘రింగ రింగా’ బ్యాగ్రౌండ్ వేసి మరీ చెప్పడంతో.. ఇంకేముంది?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం కూడా ఒక న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘రింగ రింగా’ బ్యాగ్రౌండ్ వేసి మరీ చెప్పడంతో.. ఇంకేముంది? అంతా అయిపోయిందంటూ రచ్చ నడుస్తోంది. ప్రస్తుతం అయితే బన్నీ.. తన మానాన తను అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాకా' చిత్రం చేస్తూ బాగా బిజీగా ఉన్నారు. ఆ తర్వాత కూడా మరో చిత్రాన్ని లైన్‌లో పెట్టేశారు. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో ప్రాజెక్ట్ ఫిక్స్ అయిపోయింది. బన్నీ ఇంత బిజీగా ఉన్న తరుణంలోమలయాళ దర్శకుడు బసిల్ జోసెఫ్‌తో మూవీ చేయనున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఇదంతా అయ్యేది కాదులే అనుకుంటున్న తరుణంలో బసిల్ కూడా ఓ పోస్ట్‌తో ఆ ప్రచారానికి బలం కలిగించారు.
మలయాళ డైరెక్టర్ కమ్ యాక్టర్ బసిల్ జోసెఫ్ తన ఇన్‌స్టా స్టోరీలో 'ఐకాన్' అనే పేరు రాసి ఉన్న ఫొటోను షేర్ చేయడమే కాకుండా దానికి బ్యాక్ గ్రౌండ్‌లో అల్లు అర్జున్ యాక్ట్ చేసిన ఆర్య2 మూవీలోని 'రింగ రింగా' పాటను యాడ్ చేశారు. ఇది చూసిన వారంతా బన్నీ, బసిల్ కాంబోలో మూవీ ఫిక్స్ అయిపోయిందని భావిస్తున్నారు. వాస్తవానికి వీరిద్దరి కాంబోకు సంబంధించిన ప్రచారం ఎప్పటి నుంచో నడుస్తోంది. అప్పట్లో వీరిద్దరి కాంబోలో ఎలాంటి సినిమా రానుందో కూడా ప్రచారం నడిచింది. వీరిద్దరి కాంబోలో బన్నీ శక్తిమాన్ తరహా పాత్రలో నటించనున్నాడంటూ టాక్ నడిచింది. అయితే బసిల్ అవి వట్టి పుకార్లేనని కొట్టిపడేశారు. ఈ క్రమంలోనే ఎలాంటి చిత్రం వీరిద్దరి కాంబోలో రానుందనే ఆసక్తి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలోనూ ప్రారంభమైంది.

అల్లు అర్జున్‌కు కేరళలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడి వారంతా ఆయనను ‘మల్లు అర్జున్’గా పిలుచుకుంటారు. అలాంటిది తమ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడంటే మలయాళీ ఫ్యాన్స్ ఎంత సంబరపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే స్ట్రెయిట్ మలయాలం చిత్రం చేస్తే కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయంగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ‘రాకా’ విషయానికి వస్తే.. బన్నీ గెటప్పే వెరీ వెరీ స్పెషల్. గుండు లుక్, భారీ గోర్లు, బీస్ట్ స్టైల్ అవతారంతో మునుపెన్నడూ కనిపించని లుక్‌తో బన్నీ దర్శనమిచ్చాడు. బన్నీ పూర్తిగా డిఫరెంట్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో కనువిందు చేశారు. ఈ లుక్ చూసిన అభిమానులు షాక్ అవుతూనే సినిమాపై మరింత ఆసక్తిని వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే, మీ ఊహలకు మించి సినిమా ఉంటుందని చిత్రబృందం ఇచ్చిన క్యాప్షన్ సినిమాపై హైప్‌ను పెంచేసింది. అప్పటి నుంచి ఈ సినిమా గురించి అప్డేట్ల గురించి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.