Sachin Tendulkar: సెంచరీల వెనుక సీక్రెట్ రివీల్ చేసిన సచిన్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓ సీక్రెట్‌ను ఏళ్లపాటు తనలోనే దాచుకున్నారు. మొత్తానికి ఇంత కాలానికి రివీల్ చేశారు. ఆయన సెంచరీల మీద సెంచరీలు బాదేస్తుంటే ఏమో అనుకున్నాం. దాని వెనుకున్న సీక్రెట్‌ను గ్రహించలేకపోయాం.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓ సీక్రెట్‌ను ఏళ్లపాటు తనలోనే దాచుకున్నారు. మొత్తానికి ఇంత కాలానికి రివీల్ చేశారు. ఆయన సెంచరీల మీద సెంచరీలు బాదేస్తుంటే ఏమో అనుకున్నాం. దాని వెనుకున్న సీక్రెట్‌ను గ్రహించలేకపోయాం. ఆట తీరుతోనే కాదు.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలితోనూ ఎందరికో ఆదర్శంగా నిలిచిన సచిన్.. తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. తనకు ఉదయం లేవగానే గ్రీన్ టీ తాగే అలవాటుందని సచిన్ తెలిపారు. ఉదయం లేవగానే తానే స్వయంగా గ్రీన్ టీ తయారు చేసుకుంటారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టాలో ఓ వీడియో పెట్టారు. అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక షేర్ చేసిన వీడియోలో, వేడి నీళ్ల కెటిల్ నుంచి కప్పులో నీళ్లు పోసి, టీ బ్యాగ్‌తో సచిన్ గ్రీన్ టీ తయారు చేసుకుంటున్నారు. ప్రతి రోజూ ఉదయం తన గ్రీన్ టీ తానే తయారు చేసుకుంటాననని తెలిపారు. ఇది ఈనాటి అలవాటు కాదని.. తాను క్రికెట్ ఆడే రోజుల్లో కూడా ఇదే అలవాటు ఉండేదన్నారు. తన గదిలో తనే టీ పెట్టుకునేవాడినని.. తనకు ఎవరైనా వచ్చి 'మీ టీ రెడీ' అని చెప్పడం ఏమాత్రం ఇష్టముండదన్నారు. తన పనులు తనే చేసుకోవడం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుందని సచిన్ తెలిపారు. ముఖ్యంగా మ్యాచ్‌కు ముందు తన గదిలోకి ఎవరూ రావొద్దని కోరుకునేవారట. తన ఎన్నో ఇన్నింగ్స్‌లో ఈ కప్పు టీ కూడా భాగమైందని తెలిపారు. అది చూసిన అభిమానులు.. సచిన్ సెంచరీల వెనుక గ్రీన్ టీ దాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.