Jr.NTR: ఎన్టీఆర్ పుట్టనరోజు నాటికి రూ.100 కోట్ల విరాళాలు..
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన 43వ పుట్టినరోజును మే 20న జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఓ వినూత్న కార్యక్రమానికి తెరదీశారు. అదేంటంటే.. రూ.100 కోట్ల విరాళాల సేకరణ చేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన 43వ పుట్టినరోజును మే 20న జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఓ వినూత్న కార్యక్రమానికి తెరదీశారు. అదేంటంటే.. రూ.100 కోట్ల విరాళాల సేకరణ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వసూళ్లను చేపట్టారు. ఆ డబ్బుతో ఎన్టీఆర్ పుట్టిన రోజుకు సంబంధించి చేపట్టే సేవా కార్యక్రమాల కోసం ఆ డబ్బును వెచ్చించనున్నట్టు చెబుతున్నారు. ఈ విషయం కాస్తా ఎన్టీఆర్ కార్యాలయం దృష్టికి వచ్చింది. అయితే, ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని.. అలాంటి వాటిని ఎంకరేజ్ చేయవద్దని నటుడి బృందం స్పష్టం చేసింది.
ఎన్టీఆర్ పేరుని వాడుకుంటూ కొందరు విరాళాలు సేకరించడంపై ఆయన కార్యాలయం స్పందించింది. ఆ ప్రకటనలతో ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ ఒక ప్రకటనను విడుదల చేసింది. "కొన్ని అభిమాన సంఘాలు ఎన్టీఆర్ పేరుతో ఛారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ విరాళాలు సేకరిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ కార్యక్రమాలతో ఆయనకు సంబంధం లేదు. వీటిని జూ. ఎన్టీఆర్ ఆమోదించడం లేదని స్పష్టం చేస్తున్నాం. తారక్, ఆయన ఆఫీస్‌తో సంబంధం ఉన్నట్లుగా చెబుతూ కొనసాగిస్తున్న కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని అందరినీ కోరుతున్నాం. ఎలాంటి ప్రకటనలైనా, సామాజిక కార్యక్రమాలైనా వాటి వివరాలు నేరుగా జూ. ఎన్టీఆర్ నుంచే వెల్లడవుతాయి. అభిమానులు జూ. ఎన్టీఆర్‌పై చూపుతున్న ప్రేమకు, అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు" అంటూ ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.