Entertainment Breaking News

ఆధ్యాత్మికతను, మానవ సంబంధాలతో మేళవించిన చిత్రం ‘ఏదైనా సాధ్యమే’..

ఆధ్యాత్మికతను, మానవ సంబంధాలను మేళవిస్తూ రూపొందిన సరికొత్త చిత్రం "ఏదైనా సాధ్యమే". ఈ సినిమాకు "దైవం తోడుంటే.." అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా రూపొందింది.

ఆధ్యాత్మికతను, మానవ సంబంధాలతో మేళవించిన చిత్రం ‘ఏదైనా సాధ్యమే’..

ఆధ్యాత్మికతను, మానవ సంబంధాలను మేళవిస్తూ రూపొందిన సరికొత్త చిత్రం "ఏదైనా సాధ్యమే". ఈ సినిమాకు "దైవం తోడుంటే.." అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా రూపొందింది. శ్రీ ఆది లక్ష్మి పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్ర టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు మద్దూరి రాజా, నిర్మాత అనిల్ మునగనూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్. సుబ్రహ్మణ్యం, చిత్ర బృందం పాల్గొన్నారు.

ప్రతి మనిషి తన ఇష్ట దైవంతో బలమైన అనుబంధాన్ని పెంచుకోవడం ద్వారా జీవితంలోని దుఃఖాల నుంచి, బాధల నుంచి విముక్తి పొందవచ్చనే అంశం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ముఖ్యంగా ఈ చిత్ర నిర్మాణం మొత్తం "శ్రీ అమ్మ భగవాన్" బోధనల ఆధారంగా రూపొందుతోందని చిత్ర యూనిట్ ప్రకటించింది. సినిమా కథనం ప్రధానంగా శ్రీ అమ్మ భగవాన్ చెప్పిన ఈ ఐదు సూత్రాల చుట్టూ తిరుగుతుందని మేకర్స్ ట్రైలర్ రిలీజ్ వేడుకలో వెల్లడించారు. ''నీవు ప్రత్యేకమైన వ్యక్తివి, నీ ఆంతరంగిక ప్రపంచమే బాహ్య ప్రపంచం, వ్యక్తి లేడు, వ్యక్తిత్వాలు మాత్రమే ఉంటాయి, అంతర్గత సత్యము, జీవితమంటేనే బాంధవ్యాలు.'' ఈ అంశాల ఆధారంగానే సినిమా క‌థ‌నం ఉంటుంద‌ని తెలిపారు.

కథ, మాటలు, సాహిత్యాన్ని అందిస్తూ నిర్మిస్తున్న అనిల్ కుమార్ మునగనూరి మాట్లాడుతూ.. దేశానికి యువత ఎంతో ముఖ్యమని.. కానీ చాలా మంది నిరాశలో, డిఫ్రెషన్‌లో కూరుకుపోతున్నారన్నారు. ఒక వ్యక్తికి జీవితంలో భగవంతుడి బంధం ఉన్నట్లయితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో, అసాధ్యాలు సుసాధ్యాలుగా మారుతాయనేది ఈ చిత్రం ద్వారా చెప్పదలుచుకున్నట్టుగా వెల్లడించారు. ఆధ్యాత్మిక బోధనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని.. తమ ఇష్టందైవంతో అనుసంధానమైతే అద్భుతాలు జరుగుతాయని అనిల్ మునగనూరి చెప్పారు. ఈ చిత్రానికి అనిల్ మునగనూరి కథ, మాటలు, సాహిత్యాన్ని అందించడమే కాకుండా నిర్మాణ బాధ్యతలను కూడా చేపట్టారు. రాజా మధురి దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని చిత్ర బృందం పేర్కొంది.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
May 14, 2026 7:04 PM