Vijay: రియల్ హీరోగా మారేందుకు విజయ్ ఉపయోగించిన మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీలివే..
ఒక సినిమా విడుదలకు ముందు ఎంతైతే ప్రచారం నిర్వహిస్తారో.. అంతకు మించిన ప్రచారాన్నే ఎన్నికల్లోనూ విజయ్ నిర్వహించారు. ముఖ్యంగా సామాన్యులు, యువతే ఆయన మెయిన్ టార్గెట్. వీటికి తోడు ఆకట్టుకునే మేనిఫెస్టో. టీజర్, ట్రైలర్, పాటలు, అతిథి పాత్రలతో పాటు మార్కెటింగ్ జిమ్మిక్కులు సైతం అడిషనల్‌గా ఆయన నడిపారు.
పార్టీ పెట్టి కేవలం రెండు సంవత్సరాలే.. గిరి గీసి మరీ ప్రచార బరిలోకి దిగింది కేవలం రెండంటే రెండు నెలలే. అయితే ఏంటి అధికారం దక్కించుకున్నారు. ప్రభుత్వాన్ని ఫామ్ చేయనున్నారు. ఇది ఎవరి గురించో ప్రత్యేకంగా చెప్పాలా? తమిళనాడు రీల్ మాత్రమే కాకుండా రియల్ హీరో విజయ్. అసలు కొమ్ములు తిరిగిన రాజకీయ నేతల్ని మట్టి కరిపించి.. అంతటి అనూహ్య విజయాన్ని విజయ్ ఎలా సొంతం చేసుకున్నారు? ఆయన ప్రమోషన్ స్ట్రాటజీ ఏంటి? చూద్దాం.
ఒక సినిమా విడుదలకు ముందు ఎంతైతే ప్రచారం నిర్వహిస్తారో.. అంతకు మించిన ప్రచారాన్నే ఎన్నికల్లోనూ విజయ్ నిర్వహించారు. ముఖ్యంగా సామాన్యులు, యువతే ఆయన మెయిన్ టార్గెట్. వీటికి తోడు ఆకట్టుకునే మేనిఫెస్టో. టీజర్, ట్రైలర్, పాటలు, అతిథి పాత్రలతో పాటు మార్కెటింగ్ జిమ్మిక్కులు సైతం అడిషనల్‌గా ఆయన నడిపారు. ఈ విధానమే ఆయన గెలుపునకు దోహదపడిందని డిజిటల్ మార్కెటింగ్ వ్యూహకర్తలు అంటున్నారు.
వర్చువల్ వారియర్స్‌గా..
విజయ్ ఒక స్టార్. మహిళలను, పిల్లలను పోలింగ్ బూత్‌లకు తీసుకురాగలిగితే చాలు విజయం పక్కా. ఆయన చేసింది కూడా అదేనని.. 2026 ఎన్నికల కోసం తమిళనాడులోని పార్టీలతో కలిసి పనిచేసిన, ఢిల్లీకి చెందిన ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ జై ప్రతాప్ సిసోడియా అన్నారు. ఆ ఎన్నికలలో అదనపు ఓటర్లలో 80% కంటే ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ముఖ్యంగా తన అభిమానులను విజయ్ గట్టిగా వాడేశారు. తన 85,000 అభిమాన సంఘాల నెట్‌వర్క్‌ను కదిలించారు. వారిని వర్చువల్ వారియర్స్‌గానూ.. మైక్రో ఇన్‌ఫ్లుయెన్సర్‌లుగా మార్చారు. అంతేకాకుండా టెక్నాలజీని గట్టిగా వాడేశారు. హోలోగ్రామ్‌లు, రోబోట్‌లు, ఏఐ కంటెంట్, వర్చువల్ ర్యాలీలు, హైపర్-లోకల్ డిజిటల్ మెసేజింగ్‌ను విజయ్ అద్భుతంగా వినియోగించుకున్నారు. ఆయన మెయిన్ టార్గెట్.. తొలిసారి ఓటు హక్కును వినియోగించుకునేవారు.. వారి మొత్తం కుటుంబ సభ్యులు. వాటే స్ట్రాటజీ కదా.
ఆర్గానిక్ యాంప్లిఫికేషన్..
సోషల్ మీడియా నుంచి వచ్చే మెసేజ్‌ల కంటే.. స్నేహితులు, కుటుంబ సభ్యులు, కమ్యూనిటీల నుంచి వచ్చే కంటెంట్‌ను ప్రజలు ఎక్కువగా విశ్వసిస్తారు.. విజయ్ విషయంలో అదే జరిగింది. అదే గట్టిగా పనిచేసింది. ఒక విధంగా చెప్పాలంటే.. ప్రేక్షకులే ప్రచార మాధ్యమంగా మారారనేది నిపుణులు చెబుతున్న మాట. మనీ బేస్‌డ్ ప్రమోషన్స్‌పై విజయ్ ఆధారపడలేదు. కేవలం సోషల్ మీడియా థ్రెడ్‌లు, వాట్సాప్ గ్రూపులు, లోకల్ కాన్వర్వేషన్స్‌లో తన పేరు గట్టిగా వినిపించేలా జాగ్రత్త పడ్డారు. దీనినే మార్కెటర్స్ ఆర్గానిక్ యాంప్లిఫికేషన్ అని అంటారు. అంటే ప్రజల వద్దకు కంటెంట్‌ను పంపించడం కాదు.. మొత్తం ఎన్నికల ప్రచారాన్నంతా ప్రజలే స్వయంగా తమ సంభాషణల్లో భాగంగా ముందుకు నడిపించేలా చేశారు. ఇక ప్రచారం ఎండింగ్‌కు వచ్చాక.. విజయ్ యూత్ సునామీకి పిలుపిచ్చారు.
ఓటేసేలా ఒత్తిడి..
తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి తమ 'విజయ్ మామ' గెలవడానికి సహాయపడాలంటూ యూత్‌కి విజయ్ పిలుపునిచ్చారు. అంతే.. యూత్, అభిమానులు ఆయన పిలుపునకు బాగా కనెక్ట్ అయ్యారు. పిల్లలు తల్లిదండ్రులను కొట్టడం, బెదిరించడం వంటి లక్షలాది రీళ్లు పుట్టుకొచ్చాయి. వాస్తవానికి ఈ రీళ్లలో నిజమెంతుందో తెలియదు.. అంటే ఏఐ కాలంలో దేనిని నమ్మలేం కానీ యూత్ మాత్రం విజయ్ పిలుపును సీరియస్‌గా తీసుకున్నారనడంలో సందేహం లేదు. తమ కుటుంబాన్ని విజయ్‌కు ఓటు వేసేలా ఒత్తిడి తెచ్చారు. మొత్తానికి విజయ్ అయితే యూత్ పల్స్‌ను బాగా పట్టేశారు. ఇక తమిళనాడులో ఓటింగ్ జరగడానికి కొన్ని రోజుల ముందు.. ఈ ఒక్కసారి తన మాట వింటే.. రాబోయే ఐదేళ్లపాటు తాను ప్రజల మాట వింటానని పిలుపునిచ్చారు. అది ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది. దీంతో విజయ్‌కు ఒక అవకాశం ఇవ్వమని ఓటర్లను వేడుకుంటున్న పిల్లల వీడియోలు వైరల్ అయ్యాయి.
స్ట్రాంగ్ నెట్‌వర్క్ లేదు..
ఇతర పార్టీల ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ను విజయ్ వాడారు. వారు.. ప్రత్యర్థి శిబిరాల నుంచి ఒకేసారి సుమారు 100 వరకు పరిమిత సంఖ్యలో ప్రభావవంతమైన ఖాతాలను టార్గెట్ చేసేవారు. టీవీకే విషయంలో అంతటి స్ట్రాంగ్ నెట్‌వర్క్ లేకపోవడం వల్ల డీఎంకే అనుబంధ ఖాతాలు స్పందించడం కష్టమైంది. తొలిసారిగా కరూర్ తొక్కిసలాట సమయంలో డీఎంకే ప్రచార బృందాలు మొదటిసారిగా దీనిని ఎదుర్కొన్నాయి. ఈ ఘటనకు విజయ్‌ను డీఎంకే నిందించగా, టీవీకే అనుబంధ ఖాతాలు విజయ్‌కు మద్దతునిస్తూ, సంఘటనా స్థలంలోని పోలీసుల ఏర్పాట్లను ప్రశ్నిస్తూ వీడియోలను, లోకల్ రెస్పాన్స్‌ను ప్రచారం చేశాయి. టీవీకే అధికారిక ఐటీ విభాగం ఎక్కువగా విజయ్ ప్రసంగాలను షేర్ చేయడానికే పరిమితమైంది. ప్రత్యర్థి పార్టీలు కూడబలుక్కుని మరీ తనపై దాడులు చేయిస్తున్నాయని.. విజయ్ చెప్పడమే కాకుండా దానిని విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యతను సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కు అప్పగించారు. మొత్తానికి విజయ్ తన స్ట్రాటజీలతో తమిళ ప్రజల మనసు గెలుచుకున్నారు.