BJP: కేరళలో ముచ్చటగా మూడు స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ
కేరళలో పదేళ్ల పాటు బీజేపీకి కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. ఇక బీజేపీ కేరళలో అడుగు పెట్టడం కష్టమేనని అంతా భావించారు. కానీ ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ ఖాతా తెరచింది. ముచ్చటగా మూడు స్థానాలను కైవసం చేసుకుంది.
కేరళలో పదేళ్ల పాటు బీజేపీకి కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. ఇక బీజేపీ కేరళలో అడుగు పెట్టడం కష్టమేనని అంతా భావించారు. కానీ ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ ఖాతా తెరచింది. ముచ్చటగా మూడు స్థానాలను కైవసం చేసుకుంది. నేమోం, చాతన్నూర్, కాళకూటం అసెంబ్లీ నియోజకవర్గాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. దీంతో బీజేపీ పొంగిపోతోంది. వాస్తవానికి బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని కాంగ్రెస్, సీపీఎంలు విమర్శించాయి. ఈ ఫలితాలే సమాధానమని కాషాయ పార్టీ కేరళ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. కంజిరప్పల్లిలో కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ మూడో స్థానంలో నిలవడం గమనార్హం.
నేమోం స్థానం నుంచి రాజీవ్ చంద్రశేఖర్ బరిలోకి దిగారు. ఆయన తన సమీప అభ్యర్థిపై 4,978 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక చాతన్నూర్‌లో బీజేపీ అభ్యర్థి బీబీ గోపకుమార్ 4,398 ఓట్ల మెజారిటీతో.. కాళకూటంలో కేంద్ర మాజీ మంత్రి వి.మురళీధరన్ 428 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తొలిసారిగా 2016లో ఓ సీటు సాధించింది. ఆ తరువాత తిరిగి విజయం సాధించిందే లేదు. తాజాగా తిరిగి 3 స్థానాలను కైవసం చేసుకుంది.
యూడీఎఫ్ జోరు..
ఇక కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ జోరును కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే సీఎం ఎవరనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేరళలో మొత్తం 140 స్థానాలు ఉండగా.. తాజా ఫలితాల్లో 102 స్థానాల్లో యూడీఎఫ్ విజయం సాధించింది. మొత్తానికి సెంచరీ కొట్టేసింది. గత ఎన్నికల్లో 62 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని దక్కించుకున్న ఎల్డీఎఫ్.. ఈ సారి 35 స్థానాలతో సరిపెట్టుకుంది. ధర్మదం నుంచి పోటీ చేసిన సీఎం పినరయి విజయ్ మాత్రం 19,247 ఓట్ల తేడాతో విజయం సాధించారు.