Politics

4 రాష్ట్రాల ఎన్నికలు.. వరదలై పారిన వేల కోట్ల డబ్బు..

ఎన్నికలు వచ్చాయంటే.. డబ్బు, మద్యం, ఇతర తాయిలాలు వెల్లువెత్తుతూ ఉంటాయి. ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. అక్కడ పార్టీల వ్యయం, ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకున్న వాటి విలువ తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి.

4 రాష్ట్రాల ఎన్నికలు.. వరదలై పారిన వేల కోట్ల డబ్బు..

ఎన్నికలు వచ్చాయంటే.. డబ్బు, మద్యం, ఇతర తాయిలాలు వెల్లువెత్తుతూ ఉంటాయి. ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. అక్కడ పార్టీల వ్యయం, ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకున్న వాటి విలువ తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. అసలీ సొమ్మంతా ఎక్కడి నుంచి వస్తోంది? ఇంత డబ్బు తిరిగి సంపాదించుకునేందుకు నేతలు దేనికైనా వెనుకాడరన్నది అక్షర సత్యం. యథా రాజా.. తథా ప్రజ అంటారు. కానీ ఇక్కడ ప్రజలే మెయిన్ నేరస్తులనడంలో సందేహమే లేదు.

ముందుగా.. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోంలలో పార్టీలు వెచ్చించిన డబ్బును పరిశీలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. 2026లో ఈ నాలుగు రాష్ట్రాలలో ఎన్నికల ఆర్థిక కార్యకలాపాల మొత్తం విలువ రూ.25,000 కోట్ల నుంచి రూ.35,000 కోట్ల మార్కును అధిగమించిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ స్వయంగా రూ.1,444 కోట్లకు పైగా విలువైన నగదు, మద్యం, మాదకద్రవ్యాలతో పాటు ఉచితాలను స్వాధీనం చేసుకుంది.

కొన్ని వేల కోట్ల రూపాయలు పార్టీలు వెచ్చించడమనేది షాక్‌కు గురి చేస్తోంది. ముందుగానే అనుకున్నాం కదా.. యథా రాజా.. తథా ప్రజ అని. కానీ రాజకీయాల్లో ఇది రివర్స్.. ఎన్నికలు వచ్చాయంటే డబ్బు, మందు, ఇతర తాయిలాలు చేతిలో పడితే తప్ప కనీసం ఓటు వేయడానికి కూడా ప్రజలు ముందుకు రావడం లేదు. ఏ పార్టీ నేత ఇచ్చే తాయిలాల బరువు ఎక్కువ ఉంటే.. ఆ నేతకే ఓటు. ఇక్కడ మంచి-చెడులకు స్థానం లేదు. ఈ క్రమంలోనే నేతలు ముందుగా డబ్బు పెడుతున్నారు.. ఆ తరువాత జనాల నుంచి లాగుతున్నారు. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాలు సైతం ఇష్టానుసారంగా పన్నుల భారం మోపుతున్నారు. అయినా అవేం జనాలకు పట్టవు. అందుకే మెయిన్ రాజకీయాల విషయానికి వస్తే జనాలే నేరస్తులు.

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
May 11, 2026 1:43 PM