ఏంటీ దారుణం.. అమెరికా అనుకున్నారా? అనకాపల్లా?
ఏంటో ఇండియన్స్ ఎక్కడున్నా ఆఫర్లంటే వెర్రెత్తిపోతారు. అది అమెరికానా? అనకాపల్లా? అనేది కూడా చూడరని ఓ వీడియో చూసిన కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం.. తాజాగా ములక్కాయల కోసం ఓ స్టోర్‌పైకి ఇండియన్స్ నిర్వహించిన దండయాత్ర.
ఏంటో ఇండియన్స్ ఎక్కడున్నా ఆఫర్లంటే వెర్రెత్తిపోతారు. అది అమెరికానా? అనకాపల్లా? అనేది కూడా చూడరని ఓ వీడియో చూసిన కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం.. తాజాగా ములక్కాయల కోసం ఓ స్టోర్‌పైకి ఇండియన్స్ నిర్వహించిన దండయాత్ర. ఆ వీడియోలు చూసి ఇండియన్స్ మండిపడుతున్నారు. అమెరికా న్యూజెర్సీలో ఒక ఇండియన్ గ్రోసరీ (కిరాణా) స్టోర్ దగ్గర జరిగిన తోపులాట సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గత వారం న్యూజెర్సీలోని 'పిస్కాటవే' అనే ఏరియాలో కొత్తగా 'పటేల్ బ్రదర్స్' ఇండియన్ కిరాణా స్టోర్ ప్రారంభించారు. కొత్తగా పెట్టిన వారు ఓపెనింగ్ ఆఫర్లను సర్వసాధారణంగానే పెడతారు కదా. అలాగే పటేల్ బ్రదర్స్ కూడా ఆఫర్లు పెట్టారు. ఆఫర్లు పెడితే మనం ఊరుకుంటామా? ఇండియన్స్ ఎక్కడున్నా ఇండియన్సే. అది అమెరికా అయినా అనకాపల్లి అయినా. అందుకే స్టోర్‌పై ఎగబడ్డారు. దీంతో అక్కడ తీవ్ర తోపులాట, గందరగోళం నెలకొంది.
మార్కెట్లో డిమాండ్ ఉన్న ములక్కాయలను కేవలం $1.99కే (రూ.189) అమ్ముతున్నారని తెలుసుకున్న జనాలు ఎగబడ్డారు. వాటిని కొనేందుకు ఒకరినొకరు తోసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ తొపులాట వీడియోలు ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవడంతో నెటిజన్లు దీనిపై పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. కొందరు తప్పుబడితే.. మరికొందరు సపోర్ట్ చేస్తుండగా.. ఇంకొందరు మాత్రం ఫన్నీగా స్పందిస్తున్నారు. న్యూజెర్సీలో ఉంటున్న ఎన్నారై మహిళ ఇన్‌స్టాగ్రాంలో దీనిపై స్పందించారు. తనకు ఇది చూసేందుకు చాలా ఇబ్బందిగా ఉందని.. ధరలు పెరిగిన మాట వాస్తవమే కానీ ఆఫర్ల కోసం ఇలా ప్రవర్తించడం పద్ధతి కాదని.. తన కుటుంబమైతే అలా ప్రవర్తించదని పేర్కొన్నారు. కొందరు అమెరికా నిర్వహించే 'బ్లాక్ ఫ్రైడే' సేల్స్ అప్పుడు తెల్లవాళ్ళు మాల్స్‌లో ఇంతకంటే ఘోరంగా కొట్టుకుంటారు.. మరి భారతీయులను మాత్రం ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.