‘అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి’ అని ఈ నెల 31న చెప్పేస్తుందట..
‘అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి’ అనే మాట కొద్ది రోజులుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తూనే ఉంది. అసలు ఆ అమ్మాయి ఎప్పుడు చెబుతుందా? అని ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చింది.
‘అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి’ అనే మాట కొద్ది రోజులుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తూనే ఉంది. అసలు ఆ అమ్మాయి ఎప్పుడు చెబుతుందా? అని ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చింది. అది మరెప్పుడో కాదు. ఈ మంత్ ఎండింగ్‌కే.. పవన్ మహావీర్‌ను హీరోగా పరిచయం చేస్తూ... ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శైలజా రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విభిన్న ప్రేమకధా చిత్రం "అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి". జీఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 31 విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత జి. శైలజా రెడ్డి మాట్లాడుతూ... "అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి" చిత్రం ఒకటికి రెండుసార్లు చూడాలనిపించేలా తెరకెక్కిందన్నారు. అందుకు సహకరించిన సాంకేతిక నిపుణులకు, నటీనటులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. హీరోగా పవన్ మహావీర్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఈ సినిమా చూసినవాళ్ళంతా చెబుతుంటే గర్వంతో మనసు ఉప్పొంగిపోతోందని శైలజా రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 31న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.