Entertainment

గొడవలేమీ లేవట.. ఇంకా నయం.. నిన్న కొట్టుకోలే.. స్టెప్స్ ప్రాక్టీస్ చేశాం అనలే..

సినిమాల్లోనే ట్విస్ట్‌లు ఉంటాయనుకున్నాం కానీ రియల్ లైఫ్‌లోనూ ఇలాంటి ట్విస్ట్‌లు చూస్తామనుకోలేదు. నిన్నటికి నిన్న తెలుగు డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ వద్ద బిగ్ ఫైట్ చేశారు.. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్.

గొడవలేమీ లేవట.. ఇంకా నయం.. నిన్న కొట్టుకోలే.. స్టెప్స్ ప్రాక్టీస్ చేశాం అనలే..

సినిమాల్లోనే ట్విస్ట్‌లు ఉంటాయనుకున్నాం కానీ రియల్ లైఫ్‌లోనూ ఇలాంటి ట్విస్ట్‌లు చూస్తామనుకోలేదు. నిన్నటికి నిన్న తెలుగు డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ వద్ద బిగ్ ఫైట్ చేశారు.. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్. తెల్లారి మధ్యాహ్నానికి కలిసి భోజనం చేస్తూ ఫోటోలు పెట్టి ‘మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం’ అని ప్రముఖ కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్‌లు చెబుతున్నారు. నిన్నటికి నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించేసి.. ఇవాళ కలిసి కూర్చొని భోజనం చేస్తూ స్టేట్‌మెంట్స్ ఇవ్వడం నేచురాలిటీ ఎంత విరుద్ధంగా ఉంది? అంటే చూసిన వాళ్లం పిచ్చోళ్లమా? అని నెటిజన్లు అంటున్నారు.

‘మా మధ్య గొడవలేమీ లేవంటున్నారు.. ఇంకా నయం.. నిన్న మేము కొట్టేకోలే.. కేవలం స్టెప్స్ ప్రాక్టీస్ చేశాం’ అని చెప్పనందుకు సంతోషమని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జానీ మాస్టర్ అయితే ఒకడుగు ముందుకేసి మరీ.. తాము కేవలం బాడీలో కొన్ని విషయాల మీద చర్చించుకున్నామని... కొన్ని వీడియోలు పట్టుకుని తనకు, శేఖర్ మాస్టర్‌కి గొడవ జరిగిందంటూ ప్రచారాలు చేశారంటూ ఒకరకంగా మీడియా, సోషల్ మీడియాపై దుమ్మెత్తిపోశారు. ఆ వీడియోలు చూసి మెగాస్టార్ చిరంజీవి తన సినిమా షూటింగ్‌ సమయంలో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్‌తో మాట్లాడారట. ఆ తరువాత కలిసి భజనం చేశామని జానీ మాస్టర్ చెప్పారు. దీంతో తమకు ఎలాంటి విభేదాలు లేవని తేల్చేశారు. మొత్తంగా మెగాస్టార్ పిలిచి ఫుడ్ పెడితే కానీ సెట్ కాలేదన్నమాట.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 13, 2026 2:39 PM