Varuntej Korean Kanakaraju Teaser: ఆడియోకి సంబంధం లేకుండా వీడియో..
వరుణ్‌తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ టీజర్ వచ్చేసింది. టీజర్‌లో వరుణ్ తేజ్ పెనుగొండ గురించి చెబుతుంటే.. వీడియో మాత్రం పెద్ద సిటీని చూపిస్తూ వచ్చారు.
వరుణ్‌తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ టీజర్ వచ్చేసింది. టీజర్‌లో వరుణ్ తేజ్ పెనుగొండ గురించి చెబుతుంటే.. వీడియో మాత్రం పెద్ద సిటీని చూపిస్తూ వచ్చారు. దీనికి ‘యో.. ఎవురయ్యా అది.. నేను సెప్పే ఆడియోకి సంబంధం లేకుండా వీడియో ఏస్తా ఉండేది’ అంటూ వరుణ్ తేజ్ చెప్పే డైలాగ్ చాలా హిలేరియస్‌గా అనిపించింది. పక్కా రాయలసీమ యాసలో వరుణ్ తేజ్ ఆకట్టుకున్నారు. ఆయన కెరీర్‌లోనే ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ వరుణ్ తేజ్ చేస్తున్నట్టుగా టీజర్‌ని బట్టి తెలుస్తోంది. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత క్లాసిక్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కొరియన్ కనకరాజు’ మూవీతో వరుణ్ తేజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈ క్రమంలోనే మేకర్స్ వరుస ప్రమోషన్లతో బిజీగా కాలం గడుపుతున్నారు. లేటెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ‘కొరియన్ కనకరాజు’ టీజర్ రిలీజ్ చేశారు. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ముఖ్యంగా తాగడానికి బలమైన కారణం ఉండాలి అంటూనే ‘మా ఇంటి పైన కాకి అరిచింది’ అంటూ సిల్లీ కారణాలు చెప్పడం చాలా హిలేరియస్‌గా అనిపించింది. వరుణ్ తేజ్ రఫ్ అండ్ స్టైలిష్ అవతార్‌లో మెగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడు. ఇక టీజర్ ఎండింగ్‌లోనూ పవన్ కల్యాణ్ ‘ఓజీ’ స్టైల్ మాదిరిగా గ్యాంగ్‌స్టర్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చాడు. మొత్తానికి సత్యతో కలిసి వరుణ్ తేజ్ బాగానే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేలా కనిపిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్ట్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.