Politics

Big Breaking: ఎన్టీఆర్ నుంచి ప్రకటన వచ్చేసింది..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెల 18న ఊరు-వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఎన్టీఆర్ అసోసియేషన్ ప్రకటించినప్పటి నుంచి ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి.

Big Breaking: ఎన్టీఆర్ నుంచి ప్రకటన వచ్చేసింది..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెల 18న ఊరు-వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఎన్టీఆర్ అసోసియేషన్ ప్రకటించినప్పటి నుంచి ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. రా ఎన్టీఆర్ (RAW NTR) పేరుతో ఓ సంస్థ ‘ఊరు-వాడ’ కార్యక్రమానికి తెరదీసింది. అయితే ఎన్టీఆర్ దీనిపై స్పందించకపోవడం ఆసక్తిని రేకెత్తించింది. ఇదంతా ఎన్టీఆర్‌కు తెలిసే జరుగుతుందేమోనన్న భావన జనాల్లో కలిగింది. తాజాగా ఎన్టీఆర్ టీం ఈ వ్యవహారంపై స్పందించింది. ఈ మేరకు ఒక స్పష్టమైన ప్రకటన చేసింది.

అదేంటంటే.. ఈ సంస్థకు ఎన్టీఆర్‌తో సంబంధం ఉన్నట్టుగా ప్రజల్లో భావన కలిగించే విధంగా వ్యవహరిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఎన్టీఆర్ టీం తెలిపింది. ఎన్టీఆర్‌కి కానీ, ఆయన కార్యాలయానికి గానీ, RAW NTR అనే సంస్థతో లేదా దాని కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం, అనుబంధం, అనుమతి లేదా ప్రమేయం లేదని ఎన్టీఆర్ టీం స్పష్టం చేసింది. ఆ సంస్థకు ఎన్టీఆర్ తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదని తెలిపింది. అలాగే, ఆయన పేరుతో ఎలాంటి ప్రకటనలు చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి ఎలాంటి అధికారమూ లేదని తేల్చి చెప్పింది.

ఎన్టీఆర్‌కి సంబంధించిన ఏదైనా సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం, అధికారిక ప్రకటన లేదా ఇతర కార్యకలాపాల గురించి సమాచారం ఎన్టీఆర్ లేదంటే ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడవుతుందని స్పష్టం చేసింది. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థల ద్వారా ప్రచారం చేయబడే సమాచారం, ప్రకటనలు లేదా కార్యక్రమాలను అధికారికమైనవిగా లేదా విశ్వసనీయమైనవిగా పరిగణించవద్దని ఎన్టీఆర్ టీం తెలిపింది. ఈ అంశంపై ఇదే త తరఫున తుది వివరణ అని సైతం స్పష్టం చేసింది. దీనితో ఈ విషయానికి సంబంధించిన అన్ని అపోహలు, వదంతులు, ఊహాగానాలకు పూర్తిగా ముగింపు పలుకుతాయని ఆశిస్తున్నట్టుగా పేర్కొంది. అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా, డిజిటల్, సోషల్ మీడియా వేదికలు, అలాగే ఎన్టీఆర్ అభిమానులు, శ్రేయోభిలాషులు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయవద్దని.. అధికారిక వర్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్నే విశ్వసించాలని ఎన్టీఆర్ టీం విజ్ఞప్తి చేసింది.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 14, 2026 12:06 PM