యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూసిన.. చరిత్ర గతిని మార్చేసిన మండే ఇది..
ఏదో కాస్త సండే విరామం దొరికింది కదాని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. పడుకునే వరకూ ఆలస్యమవుతుంది. ఉదయాన్నే అంటే మండే నిద్ర లేవాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే మండే అంటే చిరాకు. కానీ ఈ మండే కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురు చూసింది.
మండే అంటేనే ప్రతి ఒక్కరికీ చిరాకు. ఏదో కాస్త సండే విరామం దొరికింది కదాని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. పడుకునే వరకూ ఆలస్యమవుతుంది. ఉదయాన్నే అంటే మండే నిద్ర లేవాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే మండే అంటే చిరాకు పడతారు. కానీ ఈ మండే కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురు చూసింది. అలాగే ఈ మండే ఎవ్వరినీ నిరాశపరచలేదు. చరిత్ర గతిని మార్చేసి.. అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ఇంతకూ ఈ మండే స్పెషాలిటీ ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు. ఈ ఫలితాల కోసం ఆ ఐదు రాష్ట్రాలే కాదు.. దేశమంతా ఎదురు చూసింది. ఆ ఫలితాలు సైతం అందరికీ షాకిచ్చేలా ఉన్నాయి. చరిత్ర గతిని ఎందుకు మార్చేశాయంటే.. ఒకచోట 15 ఏళ్ల అధికారానికి చెక్ పెట్టబోతున్నాయి. అలాగే మరోచోట ఒకటే పార్టీ రెండు దఫాలుగా విజయం సాధించిన దాఖలాలు ఆ రాష్ట్ర చరిత్రలోనే లేవు. కానీ వరుసగా రెండు సార్లు అధికారాన్ని చెలాయించిన పార్టీకి తిరిగి ఈసారి ఈ మండే ఫుల్‌స్టాప్ పెట్టేసింది.
విజయ్ ప్రభంజనం..!
విజయం ఎవడబ్బ సొత్తూ కాదంటారు. కానీ విజయ్ దళపతి ఆ విజయాన్ని మడత పెట్టి తన పాకెట్‌లో పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. తమిళనాడు చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. 1967 నుంచి ఇప్పటివరకు, తమిళనాడు రాజకీయాలను ప్రధానంగా డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు తప్ప మరో పార్టీ అధికారాన్ని చెలాయించింది. లేదు. దశాబ్దాల ఈ చరిత్రకు విజయ్ దళపతి ఫుల్‌స్టాప్ పెట్టబోతున్నారు. ప్రస్తుతం ఫలితాలను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. టీవీకేకు స్పష్టమైన మెజారిటీ కనిపిస్తోంది. రాజకీయ ఆరంగేట్రం చేసి ఎంతో కాలం కాలేదు. కానీ తక్కువ సమయంలో అతి పెద్ద విజయాన్ని అందుకునే దిశగా ఆయన స్థాపించిన టీవీకే పరుగులు తీస్తోంది. ఇంతకాలం తమిళనాడులో ప్రత్యామ్నాయం లేక ఆ రెండు పార్టీలే విజయం సాధించాయా? లేదంటే విజయ్ అక్కడి ప్రజానీకానికి ఇచ్చిన భరోసా అలాంటిదా? అనేది ఎవ్వరికీ అంతుబట్టని విషయం. మొత్తానికి అర్థ శతాబ్దపు డీఎంకే, ఏఐడీఎంకే చరిత్రకు విజయ్ చెక్ పెట్టబోతున్నారని మాత్రం తెలుస్తోంది.
మమతకు మంగళం..!
ఇక పశ్చిమబెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ 2011 నుంచి వరుసగా మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారాన్ని చెలాయిస్తోంది. ప్రస్తుతం మమత ప్రభుత్వానికి మంగళం పాడేందుకు బీజేపీ సిద్ధమైంది. ఫలితాలు పూర్తిగా బీజేపీకే అనుకూలంగా కనిపిస్తున్నాయి. 34 సంవత్సరాల లెఫ్ట్ ఫ్రెంట్ ప్రభుత్వాన్ని ఓడించి అధికారంలోకి వచ్చి టీఎంకేకు ప్రస్తుతం బీజేపీ చెక్ పెట్టబోతోంది. టీఎంకే వరుసగా 15 ఏళ్ల పాటు పశ్చిమబెంగాల్‌లో అధికారాన్ని చెలాయించారు.
అరుదైన సంఘటన..
కేరళకు నిరంతరంగా ఒక పార్టీ అధికారాన్ని చెలాయించింది. లేదు. రెండు ప్రధాన కూటముల వన్ బై వన్ అధికారాన్ని చెలాయిస్తే వస్తున్నాయి. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూటములు.. 1980 నుంచి అధికారాన్ని చెలాయిస్తున్నాయి. అయితే పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ మాత్రం 40 ఏళ్ల గత చరిత్రకు చెక్ పెట్టి.. 2016, 2021 ఎన్నికల్లో వరుసగా గెలిచి రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చింది. ఇది కేరళ చరిత్రలోనే ఒక అరుదైన సంఘటన. అలాంటిది తిరిగి ఎల్‌డీఎఫ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టి యూడీఎఫ్ కూటమి అధికారంలోకి ప్రస్తుతం రానుంది. స్పష్టమైన మెజారిటీ దిశగా యూడీఎఫ్ దూసుకెళుతోంది.
బీజేపీదే అధికారం..
ఇక అస్సాంలో 2016 నుంచి బీజేపీ అధికారాన్ని చెలాయిస్తోంది. ఈసారి కూడా బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. ఈ దఫా కూడా బీజేపీయే అధికారం దక్కించుకుంటుందనడంలో సందేహమే లేదు. ప్రస్తుతం అక్కడ ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఉన్నారు.
ప్రస్తుతం కూడా..
పుదుచ్చేరి విషయానికి వస్తే ప్రస్తుతం ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (AINRC) నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉంది. దీనికి బీజేపీ మద్దతు ఉంది. ప్రస్తుతం కూడా ఇదే పార్టీ అధికారంలోకి రానున్నట్టు ఫలితాలను బట్టి తెలుస్తోంది.
ప్రజావాణి చీదిరాల