Politics

Kalvakuntla Kavitha: కేడర్ కోసం 34 వంటకాలతో తెలంగాణ రుచులతో భోజనాలు..

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ప్రకటన మరికొద్ది క్షణాల్లో జరుగబోతోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ (ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణం)లో ఆమె తన పార్టీని ప్రకటించనున్నారు.

Kalvakuntla Kavitha: కేడర్ కోసం 34 వంటకాలతో తెలంగాణ రుచులతో భోజనాలు..

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ప్రకటన మరికొద్ది క్షణాల్లో జరుగబోతోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ (ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణం)లో ఆమె తన పార్టీని ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే అద్వయ కన్వెన్షన్.. తెలంగాణ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించడానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ కార్యక్రమానికి దాదాపు 50 వేల మంది కార్యకర్తలు, అతిథులు సైతం హాజరుకానున్నారు. వారి కోసం 34 రకాల తెలంగాణ రుచులతో కవిత మధ్యాహ్నానికి భోజనాలను సిద్ధం చేయిస్తున్నారు. నూతన పార్టీ ప్రకటన అనంతరం పార్టీ కార్యకర్తలు, అతిథులకు తెలంగాణ రుచులను కవిత రుచి చూపించనున్నారు.

ఈ భోజనాలలో.. నాన్ వెజ్‌లో అయితే.. తలకాయ కూర, బోటీ ఫ్రై, తెలంగాణ మటన్ కర్రీ, నాటు కోడి పులుసు, బొమ్మిడాయల పులుసు, హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ, మిర్చి కా సాలాన్, ఎగ్ ఇగురు వడ్డించనున్నారు. వెజిటేరియన్‌లో బగారా బైంగన్ మసాలా కర్రీ, కందగడ్డ ఫ్రై, పాలకూర, మామిడికాయ పప్పు, ఆలూ టామాటా, చామగడ్డ పులుసు, కట్ చారు సిద్ధం చేయిస్తున్నారు. వీటితో పాటు తెలంగాణ ప్రత్యేక వంటకాలుగా పేరుగాంచిన మక్క గారెలు, జొన్న రొట్టె, సర్వపిండి, బూరెలు, అరిసెలను కూడా మెనులో చేర్చారు. ఇవి మాత్రమే కాదండోయ్.. వీటితో పాటు బగరా రైస్, వైట్ రైస్, సాంబర్, రోటి పచ్చడి, దోస, ఆవకాయ, మిర్చి బజ్జి, పచ్చి పులుసు, పాపడ్, పెరుగు, రైతా.. మజ్జిగ, రాగి అంబలి కూడా పార్టీ అవిర్భావ సభలో అందుబాటులో ఉంటాయి. ఇక డిజర్ట్ లో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, షాహి తుకడా, జిలేబీ కూడా వడ్డించనున్నారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
April 25, 2026 2:21 AM