Entertainment

Akash Goparaju: ‘కొత్త మలుపు’ టైటిల్‌కు తగ్గట్టే సినిమాలో ట్విస్ట్‌లను ఊహించలేరు

తను నటించిన తొలి చిత్రం ‘సర్కారు నౌకరి’ ఒక పీరియడ్ డ్రామా అయితే, ‘కొత్త మలుపు’ పూర్తిగా భిన్నమైన జానర్‌లో రూపొందిందని ఆకాశ్ తెలిపాడు. ఇది కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే విలేజ్ రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్ అని పేర్కొన్నాడు.

Akash Goparaju: ‘కొత్త మలుపు’ టైటిల్‌కు తగ్గట్టే సినిమాలో ట్విస్ట్‌లను ఊహించలేరు

ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు ప్రధాన పాత్రలో నటించిన‌ రెండో చిత్రం ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్ కేశనకుర్తి తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. కోనసీమ నేపథ్యంలో రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో ఆకాష్ మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడుతూ.. సినిమా విశేషాలు, తన పాత్ర, సింగర్ సునీత సపోర్ట్, కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

లవ్, కామెడీ, ఎమోషన్స్..

తను నటించిన తొలి చిత్రం ‘సర్కారు నౌకరి’ ఒక పీరియడ్ డ్రామా అయితే, ‘కొత్త మలుపు’ పూర్తిగా భిన్నమైన జానర్‌లో రూపొందిందని ఆకాశ్ తెలిపాడు. ఇది కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే విలేజ్ రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్ అని పేర్కొన్నాడు. లవ్, కామెడీ, ఎమోషన్స్‌తో పాటు కథను ముందుకు నడిపే ఆసక్తికరమైన సస్పెన్స్ కూడా ఉంటుందని.. అది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని తెలిపారు. ఈ సినిమాలో తన పాత్రలు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాయని.. నేటి యువత ఆలోచనలు, భావోద్వేగాలకు ఈ చిత్రంలోని తన పాత్ర చాలా దగ్గరగా ఉంటుందన్నారు. నటన పరంగా కూడా మొదటి సినిమాతో పోలిస్తే మరింత మెరుగ్గా కనిపించేందుకు ప్రయత్నించాను. బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. సీనియ‌ర్‌ల స‌ల‌హాల‌తో, మా అమ్మ సూచ‌న‌ల‌తో నా ఫ‌ర్మార్మెన్స్, యాక్టింగ్ స్కిల్స్ చాలా నేర్చుకున్నాను.

అచ్చం అలాంటి పాత్రతో..

దర్శకుడు శివ వరప్రసాద్ కథ చెప్పినప్పుడు అందులోని ట్విస్టులు తనను బాగా ఆకట్టుకున్నాయని ఆకాశ్ తెలిపాడు. తాను ఎలా అయితే స‌ర‌దాగా సాగిపోయే పాత్ర ఉండాలో అచ్చం అలాంటి పాత్ర‌తో కూడిన స‌బ్జెక్టును చెప్ప‌డంతో బాగా న‌చ్చిందన్నాడు. ఇక‌ టైటిల్‌కు తగ్గట్టే కథలో వచ్చే మలుపులు ప్రేక్షకులు ఊహించలేరని తెలిపాడు. ఇక తన చిత్రానికి మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ చాలా పెద్ద బలమని.. ఇలాంటి దిగ్గ‌జ‌ సంస్థ తమ సినిమాను విడుదల చేయడం వల్ల ప్రేక్షకుల్లో మరింత నమ్మకం పెరిగిందన్నారు. కంటెంట్‌పై విశ్వాసంతోనే వారు ముందుకు వచ్చారని.. దీని వల్ల సినిమా మరింత మందికి చేరుతుందని భావిస్తున్నామని తెలిపారు. సినిమాలో హీరోయిన్ భైరవి ఆరాద్య, తాను బావ-మరదళ్లుగా కనిపిస్తామని ఆకాశ్ తెలిపాడు. పల్లెటూరి నేపథ్యంలో సాగే మా పాత్రల మధ్య వచ్చే ప్రేమ, సరదా గొడవలు, ఫన్నీ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరిస్తాయని.. తమ జోడీ తెరపై చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుందన్నాడు.

అమ్మ హ్యాపీ..

తన తల్లి సునీత సినిమా చూసి చాలా సంతోషించిందని.. అవుట్‌పుట్ చాలా బాగుందని, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని చెప్పిందని ఆకాశ్ తెలిపాడు. తన కెరీర్ విషయంలో కథల ఎంపికలో కూడా పూర్తి స్వేచ్ఛ ఇస్తుందన్నాడు. అయితే ఎప్పుడూ తన వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తుందన్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఆమె తనకు ఎంతో సపోర్ట్ చేస్తూ వస్తుందని తెలిపాడు. ఈ సినిమా విషయంలో నిర్మాత తాటి బాలకృష్ణ ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారని.. కథకు ఏది అవసరమో అది అందించాలనే దృక్పథంతో ముందుకు వెళ్లారన్నారు. కోనసీమలోని అందమైన లొకేషన్లను సహజత్వానికి దగ్గరగా, గ్రాండ్‌గా చూపించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టుగా ఆకాశ్ తెలిపాడు. చిన్న సినిమాగా కాకుండా, ప్రతి ఫ్రేమ్‌లో ఒక మంచి క్వాలిటీ కనిపించేలా ప్రొడక్షన్ విలువలను మెయింటైన్ చేశారని వెల్లడించాడు.

సీనియర్ నటుల అనుభవం ఉపయోగపడింది..

నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ పూర్తి సహకారం అందిస్తూ సినిమా కోసం ఎంతో ప్యాషన్‌తో పనిచేశారన్నారు. రఘుబాబు, పృథ్వీరాజ్, ప్రభావతి వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారని.. వారి అనుభవం తమకు చాలా ఉపయోగపడిందన్నారు. నిర్మాత తాటి బాలకృష్ణ ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారని తెలిపారు. అలాగే యశ్వంత్ నాగ్ అందించిన అద్భుతమైన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా సహాయపడ్డాయన్నాడు. ‘కొత్త మలుపు’ ఒక ప్యూర్ ఫ్యామిలీ, లవ్ అండ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్ అని ఆకాశ్ తెలిపాడు. పల్లెటూరి అందాలు, ప్రేమ, నవ్వులు, ఎమోషన్స్, సస్పెన్స్ అన్నీ కలగలిపిన చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూసి తమను ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్టుగా తెలిపాడు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 8, 2026 11:03 AM