TFCC Short Film Festival Awards 2026: యంగ్ టాలెంట్‌కి అద్భుత అవకాశం.. 13 వరకే ఛాన్స్..
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026ను ప్రకటించారు. చిత్ర పరిశ్రమలో న్యూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకుగానూ ఆయన ఈ అవార్డులను ప్రకటించనున్నారు.
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026ను ప్రకటించారు. చిత్ర పరిశ్రమలో న్యూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకుగానూ ఆయన ఈ అవార్డులను ప్రకటించనున్నారు. దీనిలో భాగంగా అవార్డుల కమిటీ జ్యూరీకి ఛైర్ పర్సన్ గా నటి ఇంద్రజను ఎంపిక చేసినట్లు ప్రతాని రామకృష్ణ గౌడ్ వెల్లడించారు. దాదాపు 30 కేటగిరీల్లో మొదటి ఐదుగురు విజేతలకు అవార్డ్స్ .. తొలి ముగ్గురు విజేతలకు అవార్డ్స్ తో పాటు నగదు బహుమతి కూడా అందిస్తామని రామకృష్ణ గౌడ్ ప్రకటించారు. కర్ణాటక, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలుగు వాళ్లు తమ షార్ట్ ఫిలింస్‌ను తమకు పంపవచ్చని ఆయన తెలిపారు.
ఇవాళ ఆయన మీడియాతో టీఎఫ్‌సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీ మీద ఎన్నో ఆశలతో రోజూ కొత్తవారు వస్తున్నారని.. వారికి తమ కంటెంట్‌ను ఎలా ప్రదర్శించాలి, తమ ప్రతిభను ఎలా చూపించాలనేది తెలియడం లేదన్నారు. అలాంటి యంగ్ టాలెంట్ కోసం టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026 నిర్వహిస్తున్నామన్నారు. గత నెలలో తాము ప్రకటన చేసినప్పటి నుంచి భారీగా ఎంట్రీలు వస్తున్నాయని.. వీలైనంత ఎక్కువ మందికి ప్రోత్సాహం అందించాలనే తొలి ఐదు స్థానాలకు అవార్డ్స్ ఇవ్వనున్నట్టు తెలిపారు. మొదటి ముగ్గురు విజేతలకు నగదు బహుమతి కూడా ఉంటుందని.. మెన్, ఉమెన్‌కు కలిపి దాదాపు 30 కేటగిరీలు ఉన్నాయన్నారు. తొలి బహుమతిగా 10 వేలు, రెండో బహుమతిగా 7500, మూడో బహుమతిగా 5000 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చేసారి ఈ నగదు బహుమతిని మరింతగా పెంచుతామని.. దీని కోసం ఎవరి దగ్గరా ఎంట్రీ ఫీజు కూడా తీసుకోవడం లేదని.. ఉచితంగానే మీ కంటెంట్‌ను ఈ నెల 13లోగా పంపవచ్చన్నారు. ఈ నెల 21న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈవెంట్ నిర్వహిస్తామన్నారు. ఈ అవార్డుల కమిటీ జ్యూరీకి నటి ఇంద్రజని ఛైర్ పర్సన్ గా ఎంచుకున్నామని.. ఆమె ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మనల్ని అలరించారు.
నటి ఇంద్రజ మాట్లాడుతూ.. టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026 నిర్వహణ ద్వారా కొత్తవాళ్లను ప్రోత్సహించేందుకు రామకృష్ణ గౌడ్ గొప్ప పనికి పూనుకున్నారన్నారు. ఈ విషయం తనకు చెప్పినప్పుడు సంతోషంగా జ్యూరీ ఛైర్ పర్సన్ గా ఉండేందుకు ఒప్పుకున్నట్టుగా తెలిపారు. కంటెంట్ క్రియేట్ చేయడమే కాకుండా అది ప్రదర్శించే వేదిక బాగుంటే అది టీఎఫ్‌సీసీ లాంటి పేరున్న అసోసియేషన్ ద్వారా కంటెంట్ ప్రదర్శితమై అందరికీ చేరువవుతుందన్నారు. మీరు కోరుకునే స్థాయికి వెళ్లాలంటే మంచి మార్గంలోనే వెళ్లాలన్నారు. టీఎఫ్‌సీసీ ద్వారా ఎంతోమందికి రామకృష్ణ గౌడ్ ప్రోత్సాహం అందిస్తారన్నారు. ఈ అవార్డ్స్ కోసం వివిధ విభాగాల నుంచి ఇండస్ట్రీ వాళ్లు జ్యూరీలో ఉంటారని.. వారిని మీ ప్రతిభ ఆకర్షిస్తే కోరుకున్న అవకాశాలు వస్తాయన్నారు. అందుకే ఔత్సాహికులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ అవార్డ్స్ ద్వారా వచ్చే మనీ తక్కువని అనుకోవద్దని.. ఈ అవార్డ్ విలువను డబ్బుతో కొలవలేమని ఇంద్రజ తెలిపారు.
టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026 జ్యూరీ మెంబర్, మ్యూజిక్ డైరెక్టర్ భోలే శావలి మాట్లాడుతూ.. రామకృష్ణ గౌడ్ టీఎఫ్‌సీసీ ద్వారా ఎంతోమంది కళాకారులకు సపోర్ట్ గా నిలుస్తున్నారన్నారు. వారిలో తానూ ఉన్నానన్నారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026లో తానూ భాగస్వామిని కావడం సంతోషంగా ఉందన్నారు. మంచి పేరున్న రామకృష్ణ గౌడ్ నిర్వహిస్తున్న ఈ అవార్డ్స్ పోటీల్లో ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతున్నట్టు తెలిపారు. ఇంద్రజ ఈ అవార్డ్స్ కమిటీ జ్యూరీకి ఛైర్ పర్సన్‌గా ఉండటం హ్యాపీగా ఉందని భోలే శావలి తెలిపారు.