Kalvakuntla Kavitha: పార్టీ పేరుతో బీఆర్ఎస్‌ను గట్టి దెబ్బ కొట్టిన కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన పార్టీ పేరును ప్రకటించారు. పార్టీ పేరేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆపై మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు గట్టి దెబ్బే కొట్టారని అనుకుంటారు. ఇంతకీ పార్టీ పేరేంటంటే.. టీఆర్ఎస్.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన పార్టీ పేరును ప్రకటించారు. పార్టీ పేరేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆపై మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు గట్టి దెబ్బే కొట్టారని అనుకుంటారు. ఇంతకీ పార్టీ పేరేంటంటే.. టీఆర్ఎస్. అంటే.. తెలంగాణ రాష్ట్ర సేన. ఏ పేరును అయితే బీఆర్ఎస్ కోల్పోయి.. ఆపై అధికారానికి దూరమయ్యిందో.. అదే పేరును కాస్త మార్చేసి కవిత తన పార్టీకి పెట్టారు.
ఆ మధ్య కాలంలో బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్‌గా మార్చాలని గులాబీ బాస్ భావిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. పార్టీ పేరు మార్పు సైతం ఎన్నికల్లో పెద్ద దెబ్బ కొట్టిందనే భావన ఆ పార్టీ నేతలందరిలో ఉంది. మరి ఎందుకోగానీ ఈ విషయమై కేసీఆర్ ముందడుగు వేయలేదు. బీఆర్ఎస్‌కు ఎక్కడైతే దెబ్బ పడిందో.. దానిని తన ఆయుధంగా కవిత మలుచుకున్నట్టుగా పార్టీ పేరును చూస్తుంటేనే అర్థమవుతోంది. మొత్తానికి గులాబీ బాస్ మాత్రమే కాదు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కవిత సోదరుడు కేటీఆర్ అంతా అవాక్కై ఉంటారు. పసుపు-నీలం-ఆకుపచ్చ రంగుల్లో తెలంగాణ రాష్ట్ర సేన జెండాను డిజైన్ చేశారు.
జెండా మధ్యలో నీలిరంగులో తెలంగాణ మ్యాప్.. దాని మధ్యలో ఇంగ్లీష్ అక్షరాల్లో TRS పేరుతో డిజైన్ చేయడం జరిగింది. కింద ఆకుపచ్చ రంగు పట్టి దాని మధ్యలో తెలుగులో తెలంగాణ రాష్ట్ర సేన పేరును పెట్టారు. మొత్తానికి జెండా చూస్తుంటే కూడా ఆసక్తికరంగానే అనిపిస్తోంది. తన జీవితంలో ఇదొక మరుపురాని రోజుగా కవిత అభివర్ణించారు. ఈ క్రమంలోనే జెన్‌జీని.. యూత్‌ను ఆకట్టుకునేలా తన ప్రసంగం సాగించారు. ఏం జరుగుతుందని ఇవాళ రాష్ట్రంలో చాలా మంది ఎదురుచూస్తున్నారని..
20 ఏళ్లుగా తాను, తెలంగాణ జాగృతి పోషించిన పాత్ర అందరికీ తెలుసని కవిత అన్నారు. ఆడబిడ్డలందరినీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా ఊరురా బతుకమ్మ కార్యక్రమం ద్వారా చేశామన్నారు.