BJP: తెలంగాణలో బీజేపీ ప్రక్షాళనకు సిద్ధమవుతోందా?
తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ గత ఎన్నికల్లోనే గట్టిగానే ప్రయత్నించింది. కానీ ప్రయత్నం ఫలించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకైతే గట్టి పోటీనే ఇచ్చింది. ఈసారి మాత్రం ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తోంది.
తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ గత ఎన్నికల్లోనే గట్టిగానే ప్రయత్నించింది. కానీ ప్రయత్నం ఫలించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకైతే గట్టి పోటీనే ఇచ్చింది. ఈసారి మాత్రం ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తోంది. దీనిలో భాగంగానే కొన్ని కీలక నిర్ణయాలను సైతం బీజేపీ అధిష్టానం తీసుకుంది. కేంద్ర మంత్రి వర్గ విస్తరణతో పాటే తెలంగాణలో కొత్త బీజేపీ అధ్యక్షుడిని సైతం నియమించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రామచంద్రరావుని తప్పిస్తారని సమాచారం. ఆయన కారణంగా పెద్దగా ఉపయోగం లేదని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక్క అధ్యక్షుడి విషయంలోనే కాకుండా ఇతర కొన్ని మార్పులకు బీజేపీ శ్రీకారం చుడుతోందని అంటున్నారు.
మంత్రి పదవి నుంచి తప్పిస్తారా?
ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. కానీ ఆ తరువాత జరిగిన ఉపఎన్నికల్లో ఆ ఇద్దరూ ఏమాత్రం సత్తా కనబరచలేకపోయారు. ఏ ఎన్నికల్లోనూ సరైన రిజల్ట్‌ను రాబట్టలేకపోగా.. డిపాజిట్‌ను కోల్పోయిన సందర్భాలూ లేకపోలేదు. ఇది చాలదన్నట్టుగా ప్రస్తుతం బండి సంజయ్ తన కుమారుడు భగీరథ్ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే బండి సంజయ్‌ను మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే టాక్ నడుస్తోంది. ఆయన స్థానంలో మరొకరిని నియమిస్తారని తెలుస్తోంది. ఈటెల రాజేందర్‌ను బండి సంజయ్ స్థానంలో తీసుకుంటారని టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈసారి ముగ్గురిని తెలంగాణ నుంచి తీసుకుంటారని సమాచారం. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన తర్వాత ఆయనకు పెద్దగా ప్రాధాన్యత లభించిందైతే లేదు. ఈ క్రమంలోనే కనీసం రాష్ట్ర పగ్గాలు అయినా అప్పగిస్తారని భావించి నిరాశ చెందారు. దీంతో ఈటెలను కూల్ చేసేందుకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని చెప్పుకుంటున్నారు.
కిషన్‌రెడ్డి పరిస్థితేంటి?
ఇక కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి విషయానికి వస్తే.. కేంద్ర మంత్రిగా ఆయన కూడా తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేసింది కూడా లేదనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనను కూడా కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పిస్తారని ఒక టాక్ నడుస్తుంటే.. మరో శాఖను అప్పగిస్తారంటూ మరో టాక్ నడుస్తోంది. ఈసారి కేంద్రమంత్రిగా మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణను సైతం నియమిస్తారన్న టాక్ నడుస్తోంది. డీకే అరుణ.. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందినవారు కావడం కూడా ఆమెకు ఒక ప్లస్ అని తెలుస్తోంది. రేవంత్‌కు సమఉజ్జీగా బీజేపీ నుంచి డీకే అరుణనే భావిస్తున్నారు. ఒకవేళ డీకే అరుణను కేంద్ర మంత్రిగా నియమిస్తే.. అది కిషన్ రెడ్డి స్థానంలోనా? లేదంటే వేరొక స్థానంలోనా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి బీజేపీ అయితే ప్రక్షాళనకు తెరదీసిందనేది తెలుస్తోంది.