Tamilnadu Politics: తమిళనాడులో రీల్ హీరోలే.. రియల్ హీరోలు..
తమిళనాడులో సినీ తారలు ఏదో యాదృచ్చికంగా నాయకులుగా మారలేదు.. అసలు తయారవడమే అలా తయారయ్యారు. తమిళనాడులో సినిమా ఎప్పుడూ రాజకీయాలతో అవినాభావ సంబంధం కలిగి ఉంది.
తమిళనాడులో సినీ తారలు ఏదో యాదృచ్చికంగా నాయకులుగా మారలేదు.. అసలు తయారవడమే అలా తయారయ్యారు. తమిళనాడులో సినిమా ఎప్పుడూ రాజకీయాలతో అవినాభావ సంబంధం కలిగి ఉంది. ఎం. కరుణానిధి వంటి రచయితలు, ద్రవిడ మున్నేట్ర కజగం నాయకులు తమ భావజాలాన్ని ప్రచారం చేయడానికి సినిమాలను ఉపయోగించుకున్నారు. తెరపై కథానాయకులు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడారు. నిజ జీవితంలో కూడా వారు అదే చేయగలమని అక్కడి ప్రజలు నమ్మడం ప్రారంభించారు.
ఆ తర్వాత తమిళనాడు పరిస్థితిని మార్చే ప్రముఖ సినీ నటుడు ఎంజీ రామచంద్రన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన రీల్ ఇమేజ్.. రియల్ పవర్‌గా మారింది. అభిమాన సంఘాలు ఓటు బ్యాంకుగా మారాయి. ఆ తరువాత జయలలిత సైతం ఇదే మార్గాన్ని అనుసరించారు. తమిళనాడుకే ఆమె అమ్మగా మారారు. ఇప్పటికీ ఈ కల్చర్ బతికే ఉందని విజయ్ నిరూపించారు. కేవలం కొద్ది కాలంలోనే దశాబ్దాలుగా అధికారాన్ని అనుభవిస్తున్న డీఎంకే, ఏఐడీఎంకేలకు చెక్ పెట్టారు. తమిళనాడు కేవలం సినీ తారలను సృష్టించడమే కాకుండా నాయకులను సైతం తయారు చేస్తోందనడానికి ఇదే నిదర్శనం.