Politics

Cockroach Janata Party: ‘కాక్రోచ్’ అని లైట్ తీసుకుంటే.. ముంచేసే సునామీ అవుతుందా?

ఇవాళ దేశాన్ని కుదిపేస్తున్నది కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా ప్రభంజనం. ఆ పార్టీ గురించి ఒక్కొక్కరూ ఒక్కోలా అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం ఆన్‌లైన్‌లోనే ఉందని.. ఆఫ్‌లైన్‌లో లేదంటున్నవారు లేకపోలేదు. కానీ దీనిని లైట్ తీసుకోవడానికి లేదు.

Cockroach Janata Party: ‘కాక్రోచ్’ అని లైట్ తీసుకుంటే.. ముంచేసే సునామీ అవుతుందా?

ఇవాళ దేశాన్ని కుదిపేస్తున్నది కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా ప్రభంజనం. ఆ పార్టీ గురించి ఒక్కొక్కరూ ఒక్కోలా అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం ఆన్‌లైన్‌లోనే ఉందని.. ఆఫ్‌లైన్‌లో లేదంటున్నవారు లేకపోలేదు. కానీ దీనిని లైట్ తీసుకోవడానికి లేదు. ఒకవేళ రేపటి నాడు ఆఫ్‌లైన్‌లోకి వస్తే యూత్ ప్రభంనం ముందు నిలబడటం ఎవరికైనా కష్టమే. దీనికి ఇతర దేశాల నుంచి ఫాలోవర్స్ ఉన్నారు తప్ప భారత దేశీయులు ఎక్కడా లేరని వాదిస్తున్న వారూ ఉన్నారు. గుర్తించాల్సిన ఒక విషయం ఏంటంటే.. ప్రధాన పార్టీల కంటే కూడా ఫాలోవర్స్‌ను ఈ కాక్రోచ్ జనతా పార్ట కలిగి ఉండటమే. మరి ఇంత మంది ఫాలోవర్స్ విదేశాల్లోని వారేనా? మన దేశంలోని వారు లేరా? అనేది ఆసక్తికరం.

పాలకపక్షంపై అస్త్రమా?

విపక్షాలు అయితే పాలక పక్షం మీద సంధించిన ఒక అస్త్రమే కాక్రోచ్ జనతా పార్టీ అని స్పష్టంగా చెప్పేస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఇది 2026లో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక సెటైరికల్ ఉద్యమం/మీమ్ క్యాంపెయిన్. అయితే ఆరంభం ఎలా ఉన్నా.. ఆ తరువాత దానికి వచ్చిన స్పందన షాకింగ్ స్థాయిలో ఉంది. ముఖ్యంగా యువతలో ఉన్న నిరుద్యోగం, రాజకీయాలపై విసుగు, వ్యవస్థపై అసంతృప్తిని వ్యంగ్యంగా చూపిస్తోంది. ఆ వ్యంగ్యానికే జనాలు ముఖ్యంగా యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. రేపు వారంతా సంఘటితమై ఆఫ్‌లైన్‌లోకి వస్తే.. ఏ పార్టీకైనా నిలబడటం కష్టమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి ఇది పాలక పక్షం మీద తీరని అసంతృప్తిగా కాక్రోచ్ జనతా పార్టీని ఎన్డీయే వ్యతిరేక పక్షం విమర్శిస్తోంది. మరి ఎన్డీయేకి నాయకత్వం వహిస్తున్న బీజేపీ నేతలు మాత్రం కాక్రోచ్ జనతా పార్టీని చాలా లైట్ తీసుకుంటున్నాయి.

జోక్ కాదు.. ఆవేదనకు ప్రతిబింబం..

సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ అయిన ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఒక్కసారిగా కాక్‌రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) అనే పేరు ట్రెండ్ అయ్యింది. కొన్ని కథనాల ప్రకారం.. ఒక సుప్రీంకోర్టు వ్యాఖ్యపై వచ్చిన ఆన్‌లైన్‌లో రియాక్ట్ అయ్యింది. ఆ తరువాతే దీని ట్రెండ్ ఫాస్ట్‌గా పెరిగింది. అసలు “కాక్రోచ్” అనే పదాన్ని ఉపయోగించడం వెనుక ఉద్దేశం ఏమిటనేది తెలిస్తే అది ఎంత స్ట్రాంగ్‌గా మారే అవకాశం ఉందనేది సైతం తెలుస్తోంది. ఎంత కష్టమైన పరిస్థితుల్లోనైనా బతికే జీవిగా కాక్రోచ్‌ను చూపిస్తూ, యువత తమ పరిస్థితిని వ్యంగ్యంగా పోల్చుకోవడమే దీని వెనుక ఉన్న ఉద్దేశం. మరి అలాంటప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ మాత్రం ఆన్‌లైన్‌లోనే ఎందుకు ఉండి తనువు చాలిస్తుంది? ఒకవేళ బయటకు వచ్చి శాఖలను విస్తరిస్తే..? కాక్రోచ్ జనతా పార్టీ అనేది కేవలం జోక్ కాదు; యువతలోని అసలు ఆవేదనకు ప్రతిబింబంగా కొందరు అభివర్ణిస్తున్నారు.

వేగంగా ఫాలోవర్లు..

ఇన్‌స్టాగ్రామ్‌లో కాక్రోజ్ జనతా పార్టీ పేరుతో ఉన్న పేజీలు కొన్ని రోజుల్లోనే మిలియన్ల ఫాలోవర్లను సంపాదించాయి. దాదాపుగా 1.8 కోట్ల వరకు ఫాలోవర్లు వచ్చారని కొందరు పేర్కొన్నారు. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కంటే కూడా వేగంగా దీనికి ఫాలోవర్లు పెరిగారు. మహారాష్ట్రకు చెందిను అభిజిత్ దిప్కే ఈ ట్రెండ్ వెనుక ఉన్నారని కొన్ని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతానికైతే భారత ఎన్నికల సంఘం వద్ద దీని పేరు అయితే నమోదు కాలేదు. ఎన్నికల గుర్తు కానీ అధికారిక మేనిఫెస్టో కానీ లేదు. అయినా కూడా దీనికి ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కంటే కూడా వేగంగా ఫాలోవర్లు పెరిగారని తెలుస్తోంది. దీనిని వినియోగించుకుని ఆఫ్‌లైన్‌లోకి వచ్చి అధికారికంగా పార్టీని నమోదు చేస్తే ప్రభంజనమే సృష్టిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాక్రోచ్ అని లైట్ తీసుకుంటే ముంచేసే సునామీ అవడంలో సందేహం లేదని అంటున్నారు.

ప్రజావాణి చీదిరాల

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
May 25, 2026 5:45 AM