Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌కు సర్జరీ.. వైద్యులు ఏం చెప్పారంటే..
ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు శనివారం సాయంత్రం వైద్యులు సర్జరీ నిర్వహించారు. పవన్ కొద్ది నెలలుగా ఆరోగ్యపరమైన సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు శనివారం సాయంత్రం వైద్యులు సర్జరీ నిర్వహించారు. పవన్ కొద్ది నెలలుగా ఆరోగ్యపరమైన సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన తన వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలతో పాటు ఎంఆర్‌ఐ స్కాన్ నిర్వహించి ఇవాళ (శనివారం) సాయంత్రం సర్జరీ చేశారు. వారం నుంచి పది రోజులపాటు ఆయన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తిగా ఆయన కోలుకునేందుకు ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు.