others

Jafer Vs Getup Srinu: క్యాస్ట్ విషయంలో వాగ్వాదం.. అసలేం జరిగిందంటే..

బుల్లి తెర నుంచి వెండితెరపై అడుగు పెట్టి నటుడిగా ఇప్పుడిప్పుడే బాగా బిజీ అవుతున్నాడు గెటప్ శ్రీను. ఈ క్రమంలోనే పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు సైతం ఇస్తున్నాడు. తాజాగా జర్నలిస్ట్ జాఫర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Jafer Vs Getup Srinu: క్యాస్ట్ విషయంలో వాగ్వాదం.. అసలేం జరిగిందంటే..

బుల్లి తెర నుంచి వెండితెరపై అడుగు పెట్టి నటుడిగా ఇప్పుడిప్పుడే బాగా బిజీ అవుతున్నాడు గెటప్ శ్రీను. ఈ క్రమంలోనే పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు సైతం ఇస్తున్నాడు. తాజాగా జర్నలిస్ట్ జాఫర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇంటర్వ్యూ ఆరంభం మాత్రం సరదాగానే ప్రారంభమైంది. ఆ తరువాత జాఫర్ వర్సెస్ గెటప్ శ్రీనుగా మారింది. క్యాస్ట్ విషయంలో చెలరేగిన వాగ్వాదం.. తొక్కలో ఇంటర్వ్యూ అంటూ గెటప్ శ్రీను వెళ్లిపోయేందుకు దారి తీసింది. ఇంటర్వ్యూలో భాగంగా జాఫర్ అడిగిన ఒక ప్రశ్నకు గెటప్ శ్రీను సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత పరిస్థితి మారిపోయినట్లుగా సమాచారం.

గెటప్ శ్రీనుని ప్రస్తుతం ఏం చేస్తున్నారని జాఫర్ అడగ్గా.. కొణిదెల నాగబాబుతో కలిసి “మేము కాపులం” అనే వెబ్ సిరీస్ చేస్తున్నట్టుగా చెప్పాడు. కులం పేరుతో టైటిల్ పెట్టడంపై జాఫర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా కోసం ఒక కులం పేరు వాడకూడదని చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. వివాదం తీవ్ర స్థాయికి చేరడంతో గెటప్ శ్రీను ఆగ్రహంతో “ఈ తొక్కలో ఇంటర్వ్యూ నేను చేయను” అంటూ ఇంటర్వ్యూ మధ్యలోనే వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన అక్కడ ఉన్న వారిని కూడా ఆశ్చర్యానికి గురిచేసిందట. అయితే ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదంతా వెబ్ సిరీస్ పబ్లిసిటీ స్టంట్ అని కొందరు అంటున్నారు. మరికొందరేమో.. వెబ్‌సిరీస్‌కు ఒక క్యాస్ట్ పేరును టైటిల్‌గా పెట్టడమేంటని అంటున్నారు. మొత్తానికి ఈ ఇంటర్వ్యూతో పాటు వెబ్ సిరీస్ టైటిల్‌పై పెద్ద ఎత్తున నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వీడియో బయటకు వస్తే నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
May 1, 2026 2:55 PM