Entertainment Breaking News

మే 15న‌ ప్రేక్షకుల ముందుకు ‘ముసలోడికి దసరా పండుగ’

నాన్‌స్టాప్ నవ్వులు పండించ‌డానికి టాలీవుడ్ తెర‌పైకి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్‌టైన్మెంట్ మూవీ ‘ముసలోడికి దసరా పండుగ’ రాబోతోంది. ఈ చిత్రాన్ని రాజీ నాయుడు - సీత‌మ్మ వాళ్లె ఆశీస్సుల‌తో రమణా ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై యువ నిర్మాత రమణ వాళ్లె నిర్మిస్తున్నారు.

మే 15న‌ ప్రేక్షకుల ముందుకు ‘ముసలోడికి దసరా పండుగ’

నాన్‌స్టాప్ నవ్వులు పండించ‌డానికి టాలీవుడ్ తెర‌పైకి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్‌టైన్మెంట్ మూవీ ‘ముసలోడికి దసరా పండుగ’ రాబోతోంది. ఈ చిత్రాన్ని రాజీ నాయుడు - సీత‌మ్మ వాళ్లె ఆశీస్సుల‌తో రమణా ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై యువ నిర్మాత రమణ వాళ్లె నిర్మిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా ఇది రూపొందుతోంది. విలక్షణ నటుడు నాజర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ శుక్ర‌వారం (మే 15న‌) థియేట‌ర్‌ల‌లో విడుద‌ల కానుండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో జోష్‌ను పెంచేశారు. క్రేజీ టైటిల్‌తో ఇప్ప‌టికే ట్రైల‌ర్ ప్ర‌చార చిత్రాల‌తో ఈ సినిమా భారీ అంచ‌నాలను అందుకుంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత రమణ వాళ్లె మాట్లాడుతూ.. ప్రేక్షకులు థియేటర్‌కు వస్తే రెండు గంటల పాటు కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామన్నారు. సినిమా అవుట్‌పుట్ పట్ల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నామని... ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌చార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వ‌స్తోందన్నారు. సినిమా ప్ర‌తి ఒక్క‌రికి న‌చ్చుతుంద‌ని న‌మ్మ‌కంగా చెప్ప‌గ‌లమన్నారు. ఈ సినిమాను మా పితృ స‌మానులు దివంగ‌త ద‌ర్శ‌కుడు ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ‌కు అంకిత‌మిస్తున్నట్టుగా రమణ వాళ్లె తెలిపారు. చాలా కాలం త‌ర్వాత తెలుగు తెర‌పైకి ఫ్యామిలీ ఎమోషన్స్, ఫుల్ లెంగ్త్ కామెడీతో ఈ సినిమా రానుండటంతో అంచనాలు సైతం భారీగానే ున్నాయి. ఈ సినిమాలో నాజర్‌తో పాటు అంజలి (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేం), అనిత (నువ్వు నేను ఫేం), కోవై సరళ, శరణ్య, సత్య తదితరులు నటించారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
May 13, 2026 3:34 PM